బ్యాంకింగ్ రంగాన్ని ప్రైవేట్ పరం చేయొద్దు...

08:32 - August 22, 2017

బ్యాంకింగ్ రంగాన్ని ప్రభుత్వరంగంలోనే ఉంచాలని బ్యాంకింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. బ్యాంకింగ్ రంగాన్ని ప్రైవేట్ పరం చేయొద్దని చెప్పారు. ప్రజలకు ఉపయోగపడే సంస్కరణలు చేయాలన్నారు. 'బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలకు వ్యతిరేకంగా బ్యాంక్ ఉద్యోగ సంఘాలు ఉద్యమిస్తున్నాయి. ఇప్పటికే తొమ్మిది సంఘాలు ఒకే గొడుగు కిందకు వచ్చి, ఆగస్టు 22 సమ్మెకు పిలుపునిచ్చాయి. బ్యాంకింగ్ రంగంలో సంస్కరణల సారాంశం ఏమిటి? బ్యాకింగ్ రంగంలో ఎలాంటి సంస్కరణలు అమలవుతున్నాయి? ఈ సంస్కరణల వల్ల లాభపడుతున్నదెవరు? బాధపడుతున్నదెవరు? బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలను ఉద్యోగ సంఘాలు వ్యతిరేకించడానికి కారణం ఏమిటి? బ్యాంకింగ్ రంగంలో నిజంగా రావాల్సిన మార్పులేమిటి'?  అంశాలపై మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Don't Miss