2013 భూసేకరణ చట్టం స్ఫూర్తికి తూట్లు : అర్జున్

11:06 - December 30, 2016

2013 భూ సేకరణ చట్టం స్ఫూర్తికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని హైకోర్టు అడ్వకేట్ అర్జున్ అన్నారు. ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో ఆయన మాట్లాడారు. '2013 భూ సేకరణ చట్టం స్ఫూర్తికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడిచింది. 2013 భూ సేకరణ చట్టానికి సవరణలో చేస్తూ 2016 భూసేకరణ బిల్లు తీసుకొచ్చి, ఆమోదించింది.  అసెంబ్లీలో విపక్షాల అభ్యంతరాలను పట్టించుకోలేదు.  భూ నిర్వాసితుల కడుపు కొట్టేలా, 2013లో వున్న రక్షణలను తొలగించిన 2016 భూ సేకరణ చట్టంపై ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ జెఏసి కన్వీనర్ ఇప్పటికే నిరాహార దీక్ష చేపట్టారు. మండల, జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించాలంటూ ఆయన పిలుపునిచ్చారు. అసలు 2016 భూ సేకరణ బిల్లులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలేమిటి? 2013 భూ సేకరణ చట్టానికి, 2016 భూ సేకరణ బిల్లుకు తేడాలేమిటి?  భారత పార్లమెంట్ ఆమోదించిన 2013 భూ సేకరణ చట్టానికి ఒక రాష్ట్ర అసెంబ్లీ చేసిన సవరణలు చెల్లుతాయా? ఇది కోర్టులో నిలబడుతుందా? ఇలాంటి అంశాలపై ఆయన మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Don't Miss