సమాన పనికి సమాన వేతన ఇవ్వాలి....

10:45 - December 28, 2016

కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతన ఇవ్వాలని వక్తలు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో తెలంగాణ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్యదర్శి కృష్ణారెడ్డి, వికలాంగుల సంక్షేమ శాఖలోని కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం నేత వాసుదేవరావు పాల్గొని, మాట్లాడారు. 'తెలంగాణలో కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పోరుబాట పట్టారు. ఇవాళ హైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గర ధర్నా నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు. తెలంగాణలోని 31 జిల్లాల నుంచి కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఈ ధర్నాకు తరలివస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమానవేతనం ఇవ్వాలన్న డిమాండ్ తో పాటు తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలన్నది వీరి డిమాండ్'. ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Don't Miss