వస్త్ర వ్యాపారంపై నోట్ల రద్దు తీవ్ర ప్రభావం : గుండ శ్రీనివాస్

10:37 - December 16, 2016

పెద్ద నోట్ల రద్దు వస్త్ర వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపుతోందని గుండ శ్రీనివాస్ అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'నోట్ల రద్దు తర్వాత అన్ని రంగాల్లోనూ నిరాశామేఘాలు కమ్ముకున్నాయి. ఏ వ్యాపారిని పలకరించినా, తమ బాధ, వేదన వెళ్లగక్కుతున్నారు. ఎప్పుడూ కస్టమర్లతో కళకళలాడే వస్త్ర దుకాణాలు సైతం వెలవెలబోతున్న దృశ్యాలు అన్ని చోట్లా కనిపిస్తున్నాయి. నోట్ల రద్దు తర్వాత వస్త్ర వ్యాపారం ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లపై ఆయన మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Don't Miss