నష్టాల సుడిగుండలో చిన్న, కౌలు రైతులు, కూలీలు :జమలయ్య

13:41 - December 27, 2016

పెద్ద నోట్ల రద్దుతో చిన్న, కౌలు రైతులు, కూలీలు నష్టాల సుడిగుండలో చిక్కుకున్నారని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం నేత జమలయ్య అన్నారు. ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో ఆయన మాట్లాడారు. 'కరెన్సీ కష్టాలు తీరడం లేదు. సన్న, చిన్న, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, వృత్తిదారుల పరిస్థితి దయనీయంగా తయారైంది. రైతులు పంటలు అమ్ముకున్నా చేతిలోకి నగదు రావడం లేదు. దీంతో తాము చెల్లించాల్సినవి చెల్లించలేకపోతున్నారు. కరెన్సీ కష్టాలు ఇప్పట్లో తీరే అవకాశం లేదన్న వార్తలతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. భవిష్యత్ సంగతి దేవుడెరుగు అసలు ఇవాళ నడిచేదెట్లా అన్న ఆందోళన పెరుగుతోంది. ఇలాంటి సమయంలో చితికిపోతున్నవారిని ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. సన్న, చిన్న, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, చేతివృత్తుదారులకు నష్టపరిహారం చెల్లించాలంటూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, కౌలు రైతు సంఘం, వృత్తిదారుల సంఘం, కెవిపిఎస్ లాంటి ప్రజాసంఘాలు ఈ నెల 28న జిల్లా కలెక్టరేట్ల ఎదుట ధర్నా చేపడుతున్నాయి'. వంటి అంశాలపై మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Don't Miss