2013 భూసేకరణ చట్టం స్ఫూర్తికి తూట్లు : టి.సాగర్

09:31 - January 10, 2017

2013 భూసేకరణ చట్టం స్ఫూర్తికే 2016 బిల్లు తూట్లు పొడుస్తోందని నిర్వాసితుల పోరాట కమిటీ కన్వీనర్ టి.సాగర్ అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 2013 భూసేకరణ చట్టం న్యాయబద్ధంగా ఉందని..కానీ 2016 భూసేకరణ చట్టం నష్టదాయకంగా ఉందన్నారు. 2016 భూ సేకరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 'తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 2016 భూ సేకకరణ బిల్లు పై వ్యతిరేకత పెరుగుతోంది. ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలంటూ వివిధ ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 2013 భూ సేకరణ చట్టం స్పూర్తికే 2016 బిల్లు తూట్లు పొడుస్తోందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా జనవరి 12 నుంచి ఆందోళనా కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రజాసంఘాలు సిద్ధమవుతున్నాయి.  తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన 2016 భూ సేకరణ బిల్లును ప్రజా సంఘాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? 2013 భూ సేకరణ చట్టానికి, తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన 2016 బిల్లుకి వున్న తేడాలేమిటి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చర్యల వల్ల భూ నిర్వాసితులు ఏవిధంగా నష్టపోతున్నారు? అంశాలపై ఆయన మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Don't Miss