కష్టాల్లో ఓలా..ఉబర్ క్యాబ్స్..

07:13 - January 5, 2017

హైదరాబాద్ లో ఓలా, ఉబర్ లను నమ్మిన క్యాబ్ డ్రైవర్లకు కష్టాలు మొదలయ్యాయి. ఓలా, ఉబర్ లలో చేరి, అప్పులు చేసి క్యాబ్ లకు కొనుకున్నవారు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. హైదరాబాద్ లో ఏడాది క్రితం కేవలం పాతిక వేలు వున్న క్యాబ్ ల సంఖ్య ఇప్పుడు 70వేలు దాటింది. మరోవైపు డ్రైవర్లకు ట్రిప్పులివ్వడంలో ఓలా, ఉబర్ యాజమాన్యాలు వివక్ష ప్రదర్శిస్తున్నాయన్న విమర్శలున్నాయి. తమ సంస్థల ద్వారా ఫైనాన్స్ తీసుకున్నవారికి ఎక్కువ ట్రిప్పులిస్తూ, ఇతర సంస్థల దగ్గర ఫైనాన్స్ తీసుకున్నవారికి అతి తక్కువ ట్రిప్పులిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఉబర్ , ఓలా యాజమాన్యాల తీరు మీద్ర తీవ్ర అసంతృప్తితో వున్న క్యాబ్ డ్రైవర్లు, ఓనర్లు పోరుబాటపట్టారు. ఇందిరాపార్క్ దగ్గర నిరాహారదీక్షలు ప్రారంభించారు. హైదరాబాద్ లో ఓలా, ఉబర్ క్యాబ్ డ్రైవర్లు, ఓనర్లు ఎదుర్కొంటున్న విభిన్న సమస్యలపై ఇవాళ్టి జనపథంలో మాట్లాడేందుకు సిఐటియు నాయకులు ఈశ్వరరావు ఎటువంటి అభిప్రాయాలు తెలిపారో ఈ వీడియో చూడండి..

Don't Miss