సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలి : బాలకాశి

14:59 - December 12, 2016

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిందేనంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నేత బాలకాశి డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నది రాజ్యాంగం ఆదర్శం. మన దేశ రాజ్యాంగ స్ఫూర్తికి మన ప్రభుత్వాలే తూట్లు పొడుస్తున్నాయి. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, క్యాజువల్, డైలీ వేజ్, వర్క్ చార్జ్ ఇలా రకరకాల పేర్లు పెట్టి, అతి తక్కువ వేతనాలు చెల్లిస్తున్నాయి. ఈ వ్యవహారం సాక్షాత్తు సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిందేనంటూ స్పష్టం చేసింది. అక్టోబర్ 26న సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పును అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద వుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలంటూ కార్మిక సంఘాలు పోరుబాటపడుతున్నాయి. డిసెంబర్ 22న దేశవ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు'. ఈ అంశాలపై బాలకాశి మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Don't Miss