రిజర్వేషన్లు లేని సమాజమే అంబేడ్కర్‌కు నిజమైన నివాళి:పవన్కల్యాన్

13:52 - September 2, 2017

హైదరాబాద్: రిజర్వేషన్లు లేని సమాజమే అంబేడ్కర్‌కు నిజమైన నివాళి అని పవన్‌ కళ్యాణ్ అన్నారు. అంబేడ్కర్‌ చెప్పినట్లు కొంతకాలం ఇచ్చి ఆపేయాలన్నారు. కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని టీడీపీ మేనిఫెస్టోలో చెప్పిందన్నారు. రిజర్వేషన్లు ఇస్తే ఇస్తామని, లేదంటే సాధ్యం కాదని చెప్పాలి.. కానీ సమస్యని నాన్చడం సరికాదన్నారు. దానివల్ల అశాంతి రేకెత్తుతుందన్నారు. ముద్రగడ పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని చెప్పారు. అడ్డుకునే హక్కు ప్రభుత్వానికి, పోలీసులకు లేదన్నారు. పోలీసులు ముద్రగడను అడ్డుకోవడం సరికాదన్నారు. నర్సరీ నుంచి 12 వరకు ఉచిత విద్య అందించాలని చెప్పాడు. కార్పొరేట్‌ విద్యాసంస్థలు వేల కోట్లు దోచేస్తున్నాయన్నారు. తెలంగాణ కోసం ఆ ప్రాంత నేతలు గట్టిగా పోరాటం చేశారని.. ఏపీ నేతలు వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకుంటున్నారని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం మనం పోరాటం చేయకుండా కేంద్రాన్ని ఏం అడుగుతామని ప్రశ్నించారు. కేంద్రాన్ని ప్రశ్నించే ముందు, రాష్ట్ర నేతలు ఏం చేశారని అడగాలన్నారు. తాను వ్యాపార వేత్తను కాదని.. తన మీద క్రిమినల్‌ కేసులు లేవని స్పష్టం చేశారు.

Don't Miss