జ్యో అచ్యుతానంద రివ్యూ...

18:56 - September 9, 2016

ఊహలు గుసగుసలాడే చిత్రంతో సెన్సిటివ్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్న శ్రీనివాస్ అవసరాల మలిచిన మరో హ్యూమరస్ అటెమ్ట్ జ్యో అత్యుతానంద. నారా రోహిత్, నాగశౌర్య, రెజినా ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన ఈ సినిమా నేడే థియేటర్స్ లోకి వచ్చింది. ఇంతకీ శ్రీనివాస్ అవసరాల రెండో ప్రయత్నం సక్సెస్ అయిందా లేదా ....? ఊహలు గుసగుసలాడే చిత్రంతో శ్రీనివాస్ అవసరాల తానో సెన్సిటివ్ డైరెక్టర్ అని ప్రూవ్ చేసుకున్నాడు. హ్యూమరస్ ట్రీట్ మెంట్ తో రొమాంటిక్ ప్రేమకథాచిత్రంగా మలిచి మంచి సక్సెస్ సాధించాడు. రెండో సినిమా జ్యో అత్యుతానంద కూడా అదే జానర్ లో వెళతాడని అనుకున్నారు కానీ, ఇదో అన్నదమ్ముల కథగా మనం చెప్పుకోవాలి. అన్నదమ్ముల మధ్య చిలిపి తగాదాలు, చిరు గొడవలు నేపధ్యంలో ఈ సినిమాని కూడా చాలా అద్భుతమైన హ్యూమరస్ ట్రీట్ మెంట్ తో ఆద్యంతం నవ్వించాడు. ముఖ్యంగా చమత్కారపు డైలాగ్స్ తో జనాన్ని బాగా ఎంటర్ టైన్ చేసాడు. సినిమా టేకాఫ్ లోనే తాను దర్శకుడిగా ఎంత ప్రత్యేకమో చాటుకున్నాడు. ఫస్టాఫ్ అంతా హాయిగా ఎలాంటి హర్డిల్స్ లేకుండా తమాషా సన్నివేశాలతో కథనం సాగుతుంది. సెకండాఫ్ లో వేగం మందగించినా బోర్ మాత్రం కొట్టదు. హ్యూమర్ తో ఎమోషన్స్ మిక్స్ చేసి క్లీన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్నితీర్చిదిద్దాడు దర్శకుడు. కానీ ఇదో పక్కా మల్టిప్లెక్స్ మూవీ. ఇందులో లవ్ స్టోరీ పెద్దగా ఉండదు కాబట్టి, దీనికి మాస్ పీపుల్ కనెక్ట్ అవుతారని చెప్పలేం. ముఖ్యంగా బి,సి సెంటర్లలో ఈ సినిమా మనుగడ కష్టమనిపిస్తుంది.

కథ..
అత్యుత్ ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో హెచ్ .ఆర్ గా పనిచేస్తుంటాడు, అతడి తమ్ముడు ఆనంద్ మెడికల్ రిప్రజెంటేటివ్స్. వీళ్లిద్దరూ తమ ఇంటిపక్కన కొత్తగా అద్దెకు దిగిన జ్యో ని చూసి ఎట్రాక్ట్ అవుతారు. ఇద్దరూ ఒకిరి తెలియకుండా ఒకరు ఆ అమ్మాయిమీద ప్రేమ పెంచుకుంటారు. ఇద్దరూ అవ్ లెటర్స్ ఇస్తారు. కానీ ఆ అమ్మాయికి వేరే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని ఇద్దరికీ సారీ చెబుతుంది. ఇంతలో చిన్న డిస్ట్రబెన్స్ . అత్యుత్ , ఆనంద్ తండ్రికి గుండెపోటు వస్తుంది. ఈ విషయం జ్యో వాళ్లనాన్నకి చెప్పడం వల్లే గుండెపోటు వచ్చిందని అపార్ధం చేసుకొని ఆ అమ్మాయిని హర్ట్ చేస్తారు.కట్ చేస్తే ఆ అమ్మాయి అమెరికావెళ్ళిపో్తుంది. వీళ్లిద్దరికీ పెళ్లిళ్ళు అయిపోతాయి. అయితే వాళ్లభార్యల మధ్య జ్యో ప్రస్తావన వస్తుంది. దాన్ని కవర్ చేసుకోడానికి అన్నదమ్ములిద్దరూ పడే పాట్లే ఈ సినిమా మిగతా కథ. సినిమా స్టార్టింగ్ లో వీళ్లిద్దరికీ పెళ్లిళ్ళు జరిగిపోయినట్టుగానే చూపించి. ఫ్లాష్ ఎపిసోడ్స్ గా జ్యో అత్యుతానంద ల కథను చెప్పాడు దర్శకుడు. 

 పాత్రల తీరుతెన్నులు... 
నారా రోహిత్, నాగశౌర్యలు ఒకరికొకరు పోటీ పడుతూ మరీ ఈ సినిమాలో కామెడీ పండించారు. అన్నదమ్ములు గా వీరిద్దరి కెమిస్ట్రీ చాలా ప్లెజెంట్ గా ఉంటుంది. అదే మూడ్ ను సినిమా ఆద్యంతం కంటిన్యూ చేసారు. సినిమా బిగిన్ అయిన కొద్దిసేపటికే వీరిద్దరి నటనకు కనెక్ట్ అయిపోతారు ప్రేక్షకులు. ఇక రెజినా గురించి చెప్పాల్సింది పెద్దగా ఏమీలేదు. గ్లామరస్ గా కనిపించింది తక్కువ, పెర్ఫార్మెన్స్ పరంగా కూడా అంతగా ఏమీ ఉండదు కానీ, ఓకె అనిపిస్తుంది. ఇందులో విలన్స్ ఎవరూ ఉండరు, కానీ కొన్ని ట్విస్టులు మాత్రం జనానికి భలే ఎంటర్ టైన్ మెంట్ నిస్తాయి. ఇక సినిమాలో మూడొంతుల కథ వీరి ముగ్గురు చుట్టూనే నడుస్తుంది. రోహిత్, నాగశౌర్యల భార్యలు గా నటించిన అమ్మాయి లు కూడా ఉన్నంతలో బాగా నటించారు. ఇక సినిమా కి ప్రధాన డ్రా బ్యాక్ ఏంటంటే. లవ్ స్టోరీ ఏమీ లేకపోవడం, డ్యూయెట్స్ అసలు లేకపోవడం అద్భుతమైన డైలాగ్స్ తో , వినసొంపైన సంగీతంతో మాత్రం ఈ సినిమాని తెరకెక్కించాడు దర్శకుడు అవసరాల. ఇందులో ఇద్దరికీ హీరోయిన్స్ గా గ్లామరస్ ముఖాలు ఎవరూ లేరు కాబట్టి, ఇది పక్కా ఫ్యామిలీ ఎమోషనల్ మూవీ కాబట్టి మాస్ జనానికి నచ్చడం కష్టం కావచ్చు.

ప్లస్ పాయింట్స్ :
నారారోహిత్, నాగశౌర్యల నటన
సంగీతం
డైలాగ్స్
క్లాసీ స్ర్కీన్ ప్లే.
క్లైమాక్స్ .
మైనస్ పాయింట్స్ :
ప్రేమకథ లేకపోవడం
సెకండాఫ్ స్లో అవడం
రేటింగ్ : 2/5

Don't Miss