జర్నలిస్టులపై దాడిని ఖండించిన ప్రజాశక్తి జర్నలిస్టులు

20:17 - September 7, 2017

విజయవాడ : ప్రముఖ జర్నలిస్ట్‌, హేతువాది గౌరీ లంకేష్‌ హత్యను ఏపీ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ ఫెడరేషన్‌ తీవ్రంగా ఖండించింది. గౌరీ లంకేష్‌ హత్యను నిరసిస్తూ విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రం నుండి జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించారు. నిజాలను నిర్భయంగా వెలుగులోకి తెస్తున్న జర్నలిస్టులపై దాడులు జరగడంపై ప్రజాశక్తి సంఘాలు మండిపడ్డాయి. హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని జర్నలిస్టులు డిమాండ్‌ చేశారు. 

Don't Miss