'జై లవ కుశ' ట్రైలర్..

11:33 - September 10, 2017

యంగ్ టైగర్ 'ఎన్టీఆర్' హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'జై లవ కుశ' చిత్ర ట్రైలర్ ఆదివారం విడుదల కానుంది. ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శరవేగంగా షూటింగ్ కొనసాగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్స్ విడుదలయ్యాయి కూడా. ఏకంగా ఎన్టీఆర్ సినిమాలో మూడు పాత్రలను పోషిస్తుండడంతో చిత్రంపై ఆసక్తి నెలకొంది. అంతేగాకుండా ఆయా పాత్రలు దేనికవే భిన్నంగా ఉన్నాయి.

వరుస విజయాలతో దూసుకుపోతోన్న యంగ్ టైగర్ 'ఎన్టీఆర్' హీరోగా , సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మాణంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై 'జై లవ కుశ' రూపొందుతోంది. ఈ చిత్రం ఆడియోను సెప్టెంబర్ 3 న డైరెక్ట్ గా మార్కెట్ లో విడుదల చేశారు. అభిమానులను సంతృప్తి పరిచేందుకు సాయంత్రం ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. బాబీ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమాలో ఎన్టీఆర్ సరసన రాశీ ఖన్నా, నివేదిత థామస్ లు హీరోయిన్స్ నటించారు. 

Don't Miss