లాలూ..సంక్రాంతి అక్కడే...

20:00 - January 11, 2018

ఢిల్లీ : దాణా స్కాంలో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆర్జేడి చీఫ్‌ లాలు ప్రసాద్‌ యాదవ్‌ ఈసారి మకర సంక్రాంతిని జైలులోనే జరుపుకోనున్నారు. సంక్రాంతి పండగకు లాలు ఇంట్లో 'దహి చురా' స్వీట్‌ను ప్రత్యేకంగా తయారు చేయడం ఆనవాయితి. తనకు అనుమతి ఇస్తే పండగ రోజు ఇంటికి వెళ్లి 'దహి చురా' తింటానని లాలు చేసిన విజ్ఞప్తిని న్యాయమూర్తి శివపాల్‌సింగ్‌ తోసిపుచ్చారు. జైల్లోనే 'దహి చురా' తినే సౌకర్యం కల్పిస్తానని జడ్జి లాలుకు కౌంటర్‌ ఇచ్చారు. లాలూను కలవడానికి వారానికి కేవలం ముగ్గురు విజిటర్లకే న్యాయమూర్తి అనుమతించారు. లాలు జైలులో ఉన్నందున ఆర్జేడి కార్యకర్తలు మకరసంక్రాంతి పండగను జరుపుకోవడం లేదని ఆ పార్టీ ఎమ్మెల్యే భోలా యాదవ్‌ తెలిపారు. దాణా కుంభకోణం కేసులో లాలు ప్రసాద్‌ యాదవ్‌కు మూడున్నరేళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే.

Don't Miss