పంచాయతీ కార్యదర్శి పోస్టు గడువు పెంపు...

09:08 - September 12, 2018

హైదరాబాద్ : జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టులకు దరఖాస్తు గడువు అయిపోయిందని చింతిస్తున్నారా ? అదేం లేదు దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించింది. ఫీజు చెల్లింపునకు మంగళవారం చివరి తేదీ అని దరఖాస్తుకు బుధవారం అని ఇదివరకే ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ దరఖాస్తు నమోదులో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనే ఫిర్యాదులు రావడంతో గడువు తేదీని పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అభ్యర్థులకు అసౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకున్న అధికారులు… గడువు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ ఆపద్ధర్మ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు సూచ‌న‌ల‌తో.. రెండురోజుల గ‌డువు పొడిగిస్తూ నియామక కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఫీజు చెల్లించడానికి గడువును సెప్టెంబరు 14 వరకు, దరఖాస్తు చేసుకోవడానికి గడువును సెప్టెంబరు 15 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Don't Miss