పునరావాసం కల్పించాలని కె సెజ్‌ బాధితుల ఆందోళన

19:55 - October 12, 2017

తూర్పుగోదావరి : జిల్లాలోని యూ కొత్తపల్లి మండలం కె సెజ్‌ కాలనీ రణరంగంగా మారింది. కె సెజ్‌ భూ సేకరణలో పొలాలు, ఇళ్లు కోల్పోయిన రైతు కుటుంబాలకు పునరావాసం కల్పించాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎం, ఐద్వా ఆధ్వర్యంలో సెజ్‌ బాధితులు ఆందోళన నిర్వహించారు. కాలనీలో ర్యాలీ చేయడానికి ప్రయత్నించిన సీపీఎం, ఐద్వా నేతలను  పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, బాధితుల మధ్య తోపులాటలు జరిగాయి. ఉద్యమకారులను అరెస్ట్‌ చేసి పోలీసు స్టేషన్‌కి తరలించడానికి ప్రయత్నించడంతో కాలనీ వాసులు ప్రతిఘటించారు. రాష్ట్రంలో సెక్షన్‌ 30,144 పేరిట పోలీసు రాజ్యం అమలవుతొందని.. సెజ్‌ బాధితులకు న్యాయం చేసేంతవరకు ఉద్యమిస్తామని సీపీఎం నేత శేషు బాబ్జీ అన్నారు.

Don't Miss