రాయలసీమ కరువుకు వారే కారణం : కేఈ

15:58 - January 10, 2017

కర్నూలు : వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఫైర్‌ అయ్యారు. కర్నూల్‌లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన..రాయలసీమలో కరువుకు తల్లీపిల్ల కాంగ్రెస్‌లే కారణమని ఆరోపించారు. కర్నూల్‌లో సున్నపురాయి, కడపలో బెరైటీస్ గనులు,ఓబులాపురంలో ఇష్టానుసారంగా మైనింగ్ చేసి భూగర్భ జలాలు అడుగంటిపోవడానికి ఆ రెండు పార్టీలే కారణమన్నారు. రైతు భరోసా పేరుతో అభివృద్ధి నిరోధకుడిగా జగన్ వ్యవహరిస్తున్నారని కేయీ మండిపడ్డారు. 

Don't Miss