విమానయాన రంగం అభివృద్ధికి కేంద్రం కృషి : అశోక్‌గజపతిరాజు

13:40 - January 11, 2017

ఢిల్లీ : చిన్నపట్టణాల్లో విమానయాన రంగం అభివృద్ధికి కేంద్రం కృషిచేస్తోందని పౌరవిమానయానశాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు అన్నారు. ప్రాంతీయ వైమానిక అనుసంధానంపై కేంద్ర పౌరవిమానశాఖ మంత్రితో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఢిల్లీలోని విమానయానశాఖ కార్యాలయంలో కేంద్ర మంత్రి అశోక గజపతిరాజుతో తెలంగాణ మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో స్కిల్ అకాడమి స్థాపనకు విమానయానశాఖ అంగీకారం తెలిపిందని కేటీఆర్ తెలిపారు. 

 

Don't Miss