నాన్న ఆరోగ్యం బాగానే వుంది : కనిమొళి

11:25 - July 28, 2018

తమిళనాడు : డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యంపై ఆయన చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంల కరుణానిధి ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్న అభిమానులు కావేరీ ఆసుపత్రి వద్దకు భారీగా చేసుకున్నారు. ప్రస్తుతం కరుణానిధి ఆరోగ్యం స్థిరంగా ఉందనీ, ఆయన కోలుకుంటున్నారని కరుణానిధి కుమార్తె కనిమొళి తెలిపారు. వైద్యబృందం పూర్తిస్థాయిలో వైద్యాన్ని కొనసాగిస్తున్నారనీ..రెండు రోజుల్లో పూర్తి ఆరోగ్యంతో నాన్న బైటకు వస్తారని..అభిమానులెవరు ఆందోళన చెందవద్దని కరుణానిధి కుమార్తె, మాజీ మంత్రి కనిమొళి మీడియా ముఖ్యంగా ప్రకటించారు. కాగా 93 సంవత్సరాల వయస్సు డీఎంకే అధినేత కరుణానిధికి అసంఖ్యాంగా అభిమానులున్నారు. వీరంతా ఆసుపత్రి వద్దకు భారీగా చేరుకున్నారు. ఒకపక్క వృద్ధాప్య కారణం మరోపక్క లోబీపీతో బాధపడుతున్న కరుణానికి తీవ్ర అస్వస్థతతో కావేరీ ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.

కుటుంబ సభ్యులను పరామర్శించిన గవర్నర్ బన్వరీలాల్ ..
కరుణానిధిని అర్ధరాత్రి ఆస్పత్రికి తరలించడంతో డీఎంకే కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. దీంతో వేలాది మంది పార్టీ కార్యకర్తలు శనివారం ఉదయం తమ అభిమాన నేతను చూసేందుకు ఆస్పత్రికిలోకి దూసుకెళ్లారు. అక్కడే భారీగా మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆస్పత్రి వైద్యులతో తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్.. కరుణ ఆరోగ్యంపై ఆసుపత్రికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించి వైద్యుల వద్ద వాకబు చేశారు.

Don't Miss