కంజర్ కేర్వా గ్యాంగ్ ఆటకట్టు..

08:00 - August 10, 2018

హైదరాబాద్ : కంజర్ కెర్వా గ్యాంగ్ అనే ముఠా పేరు వినపడితే చాలు జనం గుండె జారిపోతోంది. ఈ ముఠా దోపిడికి తెగబడిందని తెలిస్తే చాలు పోలీసులు కేసు చేధించడాని చలా టైమ్‌ పడుతోంది. అందినంత దోచేయడం...అడ్డుపడితే ప్రాణాలు తీయడం ఈ గ్యాంగ్ కు వెన్నెతో పెట్టిన విద్య. ఎదురుతిరిగితే చాలు ముక్కలుగా నరికేస్తారు. అంతటి ఆరాచకం సృష్టిస్తారు ఈ ముఠా సభ్యులు. నరరూప రాక్షసులైన ఈ ముఠా ఆటకట్టించారు సైబరాబాద్ పోలీసులు.
నరరూపరక్షసుల కన్నా భయకరమైన ముఠా  
కంజర్ కెర్వా అనే ఈ గ్యాంగ్ పేరు పోలీసుల రికార్డులో పాపులర్. మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉండే ఈ ముఠాకు సంకెళ్లు వేయాలంటే పోలీసులు ప్రాణాలకు తెగించి చేజ్ చేయాలి. పట్టుకోవాలని చూసినా లేదా ఎదురుతిరిగినా ఈ ముఠా ఆరాచకం నరరూపరక్షసుల కన్నా భయకరంగా ఉంటుంది. ఒక్కసారి నేరం చేయాలని ఫిక్స్ అయితే చాలు పగలు రాత్రి అన్న తేడా లేకుండా పనికానిస్తారు. ఒక్కసారి స్వగ్రామం నుండి దోపిడీలకు బయలు దేరితే పక్కా ఎనిమిది రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడుతారు.
8 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటెడ్‌ లిస్ట్‌లో ముఠా
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లో ఈ ముఠా మోస్ట్ వాంటెడ్ గా పోలీసు రికార్డుల్లో  ఉంది. ఈ ముఠాకి నాయుకుడు హైదర్ అలీ. మధ్యప్రదేశ్ లోని కేర్వా జాగీర్ అనే ప్రాంతంలో ఈ ముఠా ఉండేది. ఒకప్పుడు శివారు ప్రాంతాల్లోని గ్రామాలపై దాడిచేసి అందినంత దోచుపోయే ఈ ముఠా ఇప్పుడు కాస్తా రూటు మార్చింది. హైవేలపై దారికాచి బస్సులను ఆపి ప్రయాణికులను భయభ్రాంతులకు  గురి చేసి వారి వద్ద ఉన్న డబ్బులతో ఉడాయిస్తోంది. అలా 2008 నుండి దారిదోపిడిలు మొదలు పెట్టారు. 2015లో పూణె పోలీసులు ముఠాత నాయకుడు హైదర్ అలీపై రివార్డు ప్రకటించారు.
సైబరాబాద్‌లో పెరిగిన నేరాలు
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో  ఈమధ్య నేరాల విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో రంగంలోకి దిగిన ఎస్ఓటీ పోలీసులు దోపిడిలకు పాల్పడింది కంజర్ కెర్వా గ్యాంగ్ అని గుర్తించారు. వారిని పట్టుకునేందుకు మధ్యప్రదేశ్  బయలుదేరివెళ్లారు.  అక్కడి కి వెళ్లాక పోలీసులు సీన్ చూసి అవాక్కయ్యారు. దోచుకున్న సోమ్ముతో ఈ ముఠా దర్జాగా జీవితాలు గడుపుతోంది. ఖరీదైన కార్లు, బంగ్లాలు, రిసార్ట్స్, ఫౌంహౌస్ లతో పాటు ఏకంగా పాఠశాలలను నడుపుతోంది. పోలీసులు ఈ ముఠాలోని అయిదుగురు ప్రధాన నిందితులను అదుపులో తీసుకున్నారు. ఏ రాష్ట్ర పోలీసులు చేయని సాహసం తెలంగాణ పోలీసులు తో తొలిసారిగా కంజర్ కెర్వా నేరాగాళ్ల అటకట్టించడంతో ప్రశంసలు అందుకుంటున్నారు. తొలిసారి వీరిని అరెస్ట్ చేసి పదుల సంఖ్యల్లో ఉన్న కేసుల చిక్కుమూడి విప్పారు.

 

Don't Miss