చావో..రేవో - ముద్రగడ..

12:31 - January 8, 2017

రాజమండ్రి : మళ్లీ కాపు ఉద్యమ నేత ముద్రగడ గళమెత్తారు. గత కొన్ని రోజులుగా ఆయన కాపు ఉద్యమం చేపడుతున్న సంగతి తెలిసిందే. బీసీ రిజర్వేషన్లు కల్పించాలని ముద్రగడ డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా దశల వారీగా ఆందోళనలు చేపడుతున్నారు. గతంలో నిరహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వంపై ఎన్నో విమర్శలు కూడా చేశారు. వివిధ పార్టీలకు చెందిన కాపు నేతలతో ముద్రగడ భేటీ కూడా అయ్యారు.
ఆదివారం ఉదయం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు. లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. ‘చావో..రేవో తప్ప మా పోరాటానికి విరామం లేదు..మమ్మల్ని ఓడించే ప్రయత్నం చేస్తే మీరు ఓడిపోవడం ఖాయం. బీసీ రిజర్వేషన్లు కల్పించాలంటే మీకు మేం ఏమిచ్చుకోవాలని చెప్పాలి. బీసీలను రెచ్చగొట్టడం మానుకోవాలి. బీసీలతో పాటు గిరిజనులు, హరిజనులు అని కులాల వారు మద్దతు తెలుపుతున్నారు’. అని లేఖలో ముద్రగడ పేర్కొన్నారు. ప్రభుత్వ విధానానికి నిరసనగా కాపు నేతలు రేపు రాష్ట్ర వ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నారని తెలుస్తోంది.

 

Don't Miss