పి.గన్నవరంలో కాపుల కొవ్వొత్తుల ర్యాలీ

10:13 - January 10, 2017

తూర్పుగోదావరి : పి.గన్నవరంలో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో భారీ ర్యాలీ నిర్వహిచారు. ఈ ర్యాలీలో కాపు సామాజికవర్గానికి చెందిన ప్రజలు భారీగా పాల్గొన్నారు. కాపుల జీవితాల్లో కొవ్వొత్తుల వెలుగునైనా నింపాలని ప్రభుత్వాన్ని ముద్రగడ పద్మనాభం కోరారు. సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో కాపులకు ఇచ్చిన హమీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపు ఉద్యమంలో భాగంగా  జనవరి 25న కోనసీమ ముఖద్వారం రావులపాలెం నుంచి కాపు ఉద్యమం యాత్ర ప్రారంభమై వయా అమలాపురం మీదుగా జనవరి 30వ తేదీనాటికి అంతర్వేదికి చేరుకుంటుందని ఆయన తెలిపారు.  

 

Don't Miss