రైతుల రుణమాఫీపై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం

18:44 - June 21, 2017

బెంగళూరు : రైతుల రుణమాఫీపై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 50 వేల వరకూ రైతులు తీసుకున్న స్వల్పకాలిక రుణాలను మాఫీ చేస్తున్నట్టు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో తీసుకున్న రుణాలకు మాత్రమే ఈ రుణమాఫీ వర్తిస్తుందని ఆయన తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో 22 లక్షల 27 వేల 5 వందల మంది రైతులకు లబ్ది చేకూరనుంది. రుణ మాఫీ వల్ల 8 వేల 165 కోట్ల భారం ప్రభుత్వంపై పడనుంది. కో-ఆపరేటివ్‌ బ్యాంకులు రైతులకు 10 వేల 736 కోట్ల రుణాలను రైతులకిచ్చినట్లు సిద్ధరామయ్య తెలిపారు. రైతుల రుణమాఫీకి సంబంధించి కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సిద్ధరామయ్యపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం.

Don't Miss