ఆసుపత్రిలో భర్తను లాక్కెళ్లిన భార్య..ఎందుకు ?

12:38 - June 3, 2017

భారతదేశంలో ఎన్నో అమానవీయ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కానీ అధికారులు..ప్రజాప్రతినిధులు ఏమాత్రం స్పందించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంబులెన్స్ లేక మృతదేహంతో కిలో మీటర్ల నడక..వీల్ ఛైర్ లేక ఆసుపత్రిలో సమస్యలు..ఇలా ఎన్నో ఘటనలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. రోగుల పట్ల కనీసం కనికరం కూడా చూపడం లేదు. తాజాగా ఓ ఆసుపత్రిలో నడవలేని భర్తను వీల్ ఛైర్ ఇవ్వకపోవడంతో లాక్కెళ్లింది. ఈ వీడియో సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కర్ణాటక శివమొగ్గ నగరంలో మెగ్గాన్స్ ప్రభుత్వాసుపత్రికి గత నెల 25వ తేదీన భర్త అమీర్ సాబ్ తో భార్య పామీదా వచ్చింది. అక్కడ స్కానింగ్ చేయాలని వైద్యులు సూచించారు. తన భర్త నడవలేడని..వీల్ ఛైర్ ఇవ్వాలని పామీదా అభ్యర్థించింది. వీల్ ఛైర్ ఇవ్వకపోవడంతో స్కానింగ్ సెంటర్ వరకు తన భర్తను నేలపైనే లాక్కెళ్లింది. అక్కడున్న వారు ఈ దృశ్యాలను చరవాణిలో బంధించే ప్రయత్నం చేశారు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసింది. ఘటనకు బాధ్యులుగా భావించి నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు.

Don't Miss