వెంటీలేటర్ పై కరుణానిధి..

06:47 - July 28, 2018

తమిళనాడు : కరుణానిధి నివాసం ముందు అర్థరాత్రి మరోమారు ఉద్రిక్తత చోటు చేసుకుంది. కరుణానిధి ఆరోగ్యం మరింత క్షీణించటంతో వ్యక్తిగత వైద్యుడు గోపాల్‌ హుటాహుటిన గోపాలపురం చేరుకున్నారు. అలాగే కరుణానిధి కుమార్తెలు సెల్వీ, కనిమొళి, కుమారుడు అళగిరితో పాటు పార్టీ సీనియర్‌ నేత దురై మురగన్‌ గోపాలపురం చేరుకున్నారు. కరుణానిధి ఆరోగ్యం క్షీణించటంతో అతన్ని అంబులెన్స్‌లో కావేరి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో వెంటీలేటర్ల సాయంతో కరుణానిధి చికిత్స పొందుతున్నారు. కరుణానిధి ఆస్పత్రిలో చేరటంతో కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. వేలాది సంఖ్యలో కార్యకర్తలు ఆస్పత్రి వద్దకు రావటంతో భారీగా పోలీసుల మోహరించారు. ఆస్పత్రిలోకి వెళ్లేందుకు కార్యకర్తలు ప్రయత్నించటంతో తోపులాట చోటు చేసుకుంది. దీంతో కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. 

Don't Miss