సంక్రాంతికి 'కాటమరాయుడు'..

12:11 - January 12, 2017

సంక్రాంతి బరిలో 'కాటమరాయుడు' వస్తున్నాడా ? పవన్ చిత్రం రిలీజ్ కాబోతుందా ? అని అనుమానాలు పెట్టుకోకండి. మరి సంగతి ఏంటో తెలుసుకోవాలంటే ఇది చదవండి. డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కాటమరాయుడు' చిత్రంలో 'పవన్ కళ్యాణ్' నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘సర్దార్ గబ్బర్ సింగ్' డిజాస్టర్ అనంతరం 'పవన్' ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఫ్యాక్షన్ నేపథ్యంలో చిత్రం ఉంటుందని తెలుస్తోంది. జనవరి నెలాఖరున షూటింగ్ పూర్తికానున్నట్లు టాక్. ఉగాది పండుగను పురస్కరించుకుని చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవలే 'కాటమరాయుడు'కి సంబంధించిన పలు ఫొటోలు విడుదలైన సంగతి తెలిసిందే. కానీ ఈ ఫొటోలపై అభిమానులు అంతగా సంతృప్తి చెండడం లేదని సోషల్ మాధ్యమాల్లో వార్తలు వెలువడ్డాయి. పంచకెట్టుతో ఉన్న 'పవన్' లుక్ పై మిశ్రమ స్పందన వ్యక్తమైంది. దీనితో 'కాటమరాయుడు' టీజర్ అద్భుతంగా..ఆకట్టుకొనే విధంగా ఉండాలని చిత్ర యూనిట్ ప్రత్యేక శద్ధ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. 14వ తేదీ సంక్రాంతి రోజున రాత్రి సమయంలో టీజర్ ను విడుదల చేయనున్నారని టాక్. మరి ఈ టీజర్ ఎలాంటి సంచనాలు సృష్టించనుందో వేచి చూడాలి.

Don't Miss