కాటమరాయుడు సినిమా రివ్యూ

18:51 - March 24, 2017

హిట్లు ప్లాప్ లతో సంబంధం లేకుండా తనకున్న క్రేజ్ తో, తన స్టార్ డమ్ కు ఉన్న పవర్ తో కాసుల వర్షం కురిపించే స్టార్ హీరో పవన్ కల్యాణ్. గత సినిమా సర్ధార్ గబ్బర్ సింగ్ కొని నష్టపోయిన డిస్టిబ్యూటర్లకు, నిర్మాతలకు లాభాలు అందించడానికి, అభిమానులను అలరించడానికి కాటమ రాయుడుగా పంచె కట్టి కత్తి పట్టి థియేటర్స్ లోకి వచ్చాడు. టీజర్ ట్ర్రైలర్స్ తో తన ప్రభంజనాన్ని చూపించిన పవర్ స్టార్ ఈ సినిమాతో ఎలాంటి రిజల్ట్స్ అందుకున్నాడో చూద్దాం..

కథ విషయానికి వస్తే నలుగురు అనాధలను చేరదీసి, తన తమ్ముళ్ళుగా చాలా ప్రేమగా చూసుకుంటాడు కాటమరాయుడు. కాని చిన్న తనంలో జరిగిన ఓ సంఘటన వలన లవ్ అన్నా, అమ్మాయి అన్నా అస్సలు పడదు కాటమరాయుడికి. అయితే అతని తమ్ముళ్లు మాత్రం లవ్ లో పడతారు. అన్నయ్యను ఎదురించి పెళ్లి చేసుకోకూడదు అని ముందుగా కాటమరాయుడిని లవ్ ట్రాక్ లోకి లాగడానికి ట్రై చేస్తారు అతని తమ్ముళ్లు. అందుకోసం అవంతికా అనే క్లాసికల్ డాన్సర్ ను ఎంచుకుంటారు. అన్యాయాన్నిచూసి సహించలేని కాటమరాయుడికి వైలెన్స్ అంటే ఆమడ దూరంలో ఉండు అవంతికాకు ప్రేమ పుట్టిందా.... ఆ ప్రేమ సక్సెస్ కావడానికి వీళ్శిద్దరిలో ఎవరు తమ స్వభావాన్ని మార్చుకున్నారు. వైలెన్స్ తో సాగిపోయిన గతం అతనికి, అతని ప్రేమకి ఎలాంటి ప్రోబ్లమ్స్ ను క్రియేట్ చేసింది. వాటిని కాటమ రాయుడు ఎలా ఎదుర్కుని హిరోగా ఎలా నిలబడ్డాడు అనేది సినిమా చూసి తెలుసుకోవలసిందే...

నటీ నటుల విషయానికి వస్తే సినిమా మొత్తాన్ని తన బుజాలపై వేసుకుని అభిమానులు కోరుకునే అంశాలతో పాటు ఆడియన్స్ ఎక్స్ పర్డ్ చేసే ఎలిమెంట్స్ మిక్స్ చేసి, అన్ని వేరియేషన్స్ ను నీట్ గా ప్రజంట్ చేశాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఈ సినిమాకు బిగ్గెస్ట్ ఎసెట్ పవన్ కల్యాణే... గబ్బర్ సింగ్ లో ఆడియన్స్ నుఅలరించిన శృతి హాసన్ ఈ సినిమాలో మాత్రం నటన పరంగా, ఎపీరియన్స్ పరంగా కూడా అంత ఇంప్రెసీవ్ గా అనిపించలేదు. గ్లామర్ పరంగా మాత్రం కొంచెం ఓవర్ డోస్ ఇచ్చింది. అలాగే ఎప్పుడూ ఫిట్ గా ఉండే శృతీ హాసన్ సినిమాలో బొద్దుగా షేప్ అవుట్ గా కనిపించింది. ఇక పవన్ తమ్ముళ్ళుగా నటించిన అజయ్, శివబాలాజి, కమల్ కామరాజు, చైతన్య కృష్ణ, తమ క్యారక్టర్స్ పరిది మేరకు న్యాయం చేశారు. ఆలీ పంచెస్ వర్కౌట్ అయ్యాయి. పృధ్వీ క్యారక్టర్ రొటీన్ గా ఉన్నా ఓకే అనిపిస్తుంది. ఇక నాజర్, అతని కుటుంబం అంతా గ్రాండ్ ఇయర్ కోసం పెట్టిన సెటప్ లా కనిపిస్తుంది. రావు రమేష్ క్యారక్టర్, ఆ క్యారక్టర్ లో అతని నటన కొత్తాడా ఉంది. విలన్స్ ప్రదీప్ రావత్, తరుణ్ అరోరా... తమ క్యారక్టర్లలో తేలిపోయారు...

ఇక టెక్నీషియన్స్ విషయానికి వస్తే అందరికంటే ఎక్కువ మార్కులు వేయించుకుంది సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మూరెళ్ళ. సినిమా కంటెంట్ ను డ్రైవ్ చేసుకుని పవన్ ప్రజెంటేషన్ పై ప్రత్యేక శ్రధ్ద పెట్టాడు. బ్రహ్మకడలి ఆర్ట్ వర్క్ సినిమాకు రిచ్ నెస్ తీసుకు వచ్చింది. రామ్ లక్ష్మన్ ఫైట్స్ పవన్ ఫాన్స్ తో పాటు, మాస్ ఆడియన్స్ అందరిని విపరీతంగా ఎంటర్ టైన్ చేస్తాయి.... అనూప్ రుబెన్స్ సంగీతం అప్ టూ ద మార్క్ లేదు అనేది అందరూ ఒప్పుకుకే నిజం... పాటలు అంతత మాత్రంగానే ఉన్నాయి... ఆర్ ఆర్ పర్వాలేదు అనిపించినా కంటెంట్ ను పూర్తిగా ఎలివేట్ చేయలేకపోయింది. డాన్స్ లుఅన్నీ పవన్ కల్యాణ్ స్టెప్ లతో.. శృతీ హాసన్ గ్లమరస్ లుక్ తో అలా అలా సాగిపోయారు.. పవన్ తో ఇంతకు ముందు గోపాల గోపాల తీసిన డైరక్టర్ డాలి, ఈ సారి కూడాపవన్ పైనే ఎక్కువ దృష్టి పెట్టాడు. ఫస్ట్ ఆఫ్ అన్ని విషయాలలో పుల్ ప్లజ్డ్ గా నడిపించిన డాలి. సెకండ్ ఆఫ్ విషయంలో తడబడ్డాడు అని చెప్పాలి. యాక్షన్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ఎమోషన్స్ పై ఇంకొంచె కేర్ తీసుకుని ఉంటే సినిమాకు చాలా ప్లస్ అయ్యేది. ప్రొడక్షన్స్ వ్యాల్యూస్ చాలా బావున్నాయి...

ఓవర్ ఆల్ గా సమ్మర్ సీజన్ ను స్టార్ట్ చేసి కాటమ రాయుడు, టాక్ పరంగా కొంచెం అటూ ఇటూ ఉన్నా కలెక్షన్స్ పరంగా దుమ్ము దులపడం కాయం.. ఎందుకంటే ఫాన్స్ పండుగ చేసుకునే అంశాలతో పాటు, ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కనెక్ట్ అయ్యేలా, అన్నిరకాల కమర్షియల్ ఎలిమెంట్స్ పక్కాగా సెట్ అయ్యాయి...

ప్లస్ పాయింట్స్

పవన్ స్క్రీన్ ప్రజెంట్స్

కామెడీ

ఫైట్స్

ప్రొడక్షన్ వ్యాల్యూస్


 

మైనస్ పాయింట్స్

బలం లేని ఎమోషన్స్

సాంగ్స్

సెకండ్ ఆఫ్ స్క్రీన్ ఫ్లే

రేటింగ్ తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి...

Don't Miss