పైసా వసూల్ మూవీ రివ్యూ

20:27 - September 1, 2017

గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాతో భారీ హిట్ అందుకున్న బాలయ్య 101 వ సినిమాగా డాషింగ్ డైరెక్టర్ పూరి డైరెక్షన్ లో పైసా వసూల్ అనే మాస్ మసాలా సినిమా చేస్తున్నాడు అనగానే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక స్టంపర్ పూరి స్టైల్ లో సూపర్ గా ఉండడంతో,ట్రైలర్ చాలా కొత్తగా అనిపించడంతో ఈ సినిమా గురించి ఫాన్స్ తో సహా అంతా క్యూరియస్ గా వెయిట్ చేసారు.అలా అంతా ఏంహో ఆతృతగా ఎదురు చూసిన ఈ సినిమా ఈ రోజు విడుదలయింది. ఎలాంటి రిజల్ట్ సాధించిందో ఇప్పడు చూద్దాం.ఈ సినిమా కథ విషయానికి వస్తే క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న తేడా సింగ్ తీహార్ జైలు నుండి రీలీజ్ అయ్యి హైదరాబాద్ వస్తాడు.అయితే అనుకోకుండా అతనికి వరల్డ్ నోటోరియస్ క్రిమినల్ అయిన బాబ్ మార్లీ గ్యాంగ్ తో గొడవ జరుగుతుంది.ఆ టైం లో తేడా సింగ్ ని అరెస్ట్ చేసిన పోలీసులు అతని క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ని తెలుసుకుని అతన్ని వాడుకుని బాబ్ మార్లీ గ్యాంగ్ ని పట్టుకోవాలనుకుంటారు.అయితే తేడా సింగ్ అదే విషయాన్ని ఆ గ్యాంగ్ కి చెప్పి వాళ్ళతోనే ఫ్రెండ్ షిప్ చేస్తాడు.కానీ బాబ్ మార్లీ గ్యాంగ్ తన గర్ల్ ఫ్రెండ్ ఆయన హారిక ను కిడ్నాప్ చెయ్యడంతో వాళ్ళను కొట్టి ఆమెను కాపాడతాడు.కానీ అతన్ని కాపాడిన తేడా సింగ్ ని కాల్చేస్తుంది హారిక.హారిక తేడా సింగ్ ని ఎందుకు చంపాలనుకుంది?,తేడాసింగ్ కి హారిక కుటుంబానికి సంబంధం ఏమిటి?ఇంతకీ అసలు తేడా సింగ్ ఎవరు?,అతని గతం ఏమిటి అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి.నటీ నటుల విషయానికి వస్తే ఈ సినిమా కి వచ్చిన వాళ్లకు పైసా వసూల్ అనే ఫీలింగ్ కలిగిస్తుంది బాలయ్య యాక్షన్.పూరి రాసిన టిపికల్ హీరో క్యారెక్టర్ ని చాలా నమ్మి,బాగా హార్డ్ వర్క్ చేసి స్క్రీన్ పై యాస్ ఇట్ ఈజ్ ప్రెజెంట్ చేసాడు బాలయ్య.పూరి మార్క్ డైలాగ్స్ ని,మ్యానరిజమ్స్ ని బాలయ్య చెప్పిన తీరు,చేసిన స్టైల్ ఆశ్చర్యం కలిగిస్తుంది.వంద సినిమాలు చేసిన బాలయ్య కూడా కొత్తగా కనిపిస్తాడు.ఇక హీరోయిన్స్ ముస్కాన్ సేథీ,ఐటెం సాంగ్ చేసిన కైరా దత్ లు కేవలం తెరపై గ్లామరస్ గా కనిపించడానికే పరిమితమయ్యారు.ఇక మెయిన్ లీడ్ అయిన శ్రేయ కి కూడా పెద్ద గా ప్యాదాన్యత ఉన్న క్యారెక్టర్ దక్కలేదు.బాలీవుడ్ యాక్టర్ కబీర్ బేడీ కి కూడా సాధారణ పాత్రా మాత్రమే దక్కింది.ఇక అలీ,పృథ్వి లాంటి కమెడియన్స్ ఉన్నా కూడా పెద్దగా యూజ్ చేసుకోలేదు.మిగతా నటీ నటులంతా తమ పాత్రల పరిధిమేర నటించారు.ఇక టెక్నీషియన్స్ విషయానికి వస్తే ఈ సినిమాకి స్టోరీ,స్క్రీన్ ప్లే,డైలాగ్స్ రాసుకుని డైరెక్ట్ చేసిన పూరి గురించి చెప్పుకోవాలి.ఈ మధ్య చాలా పేలవమయిన సినిమాలు చేస్తూ నిరుత్సాహ పరుస్తున్న పూరి ఈ సారి కొంచెం కష్టపడ్డాడు.స్టోరీ పరంగా పెద్దగా కసరత్తు చెయ్యకపోయినా తేడా సింగ్ క్యారెక్టర్ ని మలచడంలో,దానికి తగ్గ డైలాగ్స్ రాసి మెప్పించడంలో పూరి సక్సెస్ అయ్యాడు.కాకపోతే కొన్ని బాలయ్య ఏజ్ కి మ్యాచ్ అవ్వని సీన్స్,పూర్తిగా లాజిక్ లేకుండా నడిచి పోయే సీన్స్ మాత్రం ఇబ్బందికరంగా అనిపిస్తాయి.ఇప్పటివరకు మెలోడియస్ మ్యూజిక్ కి ఎంబ్లెమ్ లా ఉన్న మ్యూజిక్  డైరెక్టర్ అనూప్ రూబెన్స్ ఫస్ట్ టైం అవుట్ అండ్ అవుట్ మాస్ మసాలా ఆర్.ఆర్ తో అలరించాడు.ఇక ముఖేష్ కెమెరా వర్క్ గురించి స్పెషల్ గా చెప్పుకోవాలి.సినిమాకు రిచ్ లుక్ ని,బాలయ్యకి కొత్త లుక్ తీసుకురావడంలో అతని కృషి చాలా ఉంది.పోర్చుగల్ ఎపిసోడ్ లో అతని పనితనం కనిపిస్తుంది.ఇక హీరోయిజం ఎలివేట్ చేసే హై స్పీడ్ షాట్స్ లో ప్రత్యేకత కనిపిస్తుంది.ఇక భవ్య క్రియేషన్స్ నిర్మాణ విలువలు బావున్నాయి.ఓవర్ ఆల్ గా చెప్పాలంటే బాలయ్య కోసం ఒక టిపికల్ క్యారెక్టర్ రాసుకుని ఫాన్స్ అంతా  ఆమోదించేలా దానిని తీర్చి దిద్ది పైసా వసూల్ అనే సినిమా చేసాడు పూరి.మాస్ ఆడియెన్స్ కి కూడా కిక్ ఇచ్చే పూరి మార్క్ పంచ్ డైలాగ్స్,కొత్తగా అనిపించే తేడా సింగ్ క్యారెక్టరైజేషన్ కనెక్ట్ అయిన వారికి పైసా వసూల్ అయిన ఫీలింగ్ వస్తుంది.అలాగే మాస్ ఎలిమెంట్స్ దట్టించడంలో కూడా పూరి చాలా వరకు సక్సెస్ అయ్యాడు.అయితే కథ పరంగా కొంచెం కేర్ తీసుకుని పోకిరి ఛాయలు కనిపించకుండా సినిమా తీసుంటే రిజల్ట్ మరోలా ఉండేది.ప్రస్తుతానికయితే ఒక సగటు అభిమానిగా పూరి తీసిన ఈ సినిమా చూసి బాలయ్య అభిమానులు పండగ చేసుకుంటున్నారు.మిగతా వర్గాలవారికి ఈ సినిమా ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అనేది వేచి చూడాలి.

ప్లస్ పాయింట్స్:
బాలయ్య నటన ,  క్యారెక్టర్
పూరి డైలాగ్స్ 
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ 
కెమెరా వర్క్ 
నిర్మాణ విలువలు 

మైనస్ పాయింట్స్ :
రొటీన్ కథ
లాజిక్స్ లేని స్క్రీన్ ప్లే  
పోకిరిని పోలిన ట్విస్ట్ 
ఎక్సైట్ చెయ్యని ఫ్లాష్ బ్యాక్
ఎక్కువయిన యాక్షన్ సీక్వెన్సెస్  
   
రేటింగ్ .. 2.25/5

Don't Miss