పిడబ్ల్యూడీ స్కాంలో కేజ్రీవాల్‌ మేనల్లుడు అరెస్ట్

18:10 - May 10, 2018

ఢిల్లీ : అవినీతి ఆరోపణలపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ సమీప బంధువును ఏసిబి అరెస్ట్‌ చేసింది. 10 కోట్ల పిడబ్య్లూడీ కుంభకోణానికి సంబంధించి కేజ్రీవాల్‌ మేనల్లుడు వినయ్‌కుమార్‌ బన్సాల్‌ను గురువారం ఉదయం ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. బన్సాల్‌ ఇంటిపై ఏసిబి జరిపిన దాడుల్లో అధికారులు పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్‌ బావ సురేందర్‌ బన్సాల్‌ గత ఏడాది మృతి చెందాడు. 2015-16లో ఢిల్లీలో రోడ్లు, పైప్‌లైన్ల నిర్మాణ కాంట్రాక్టు మంజూరులో అక్రమాలు చోటుచేసుకున్నాయని, నకిలీ బిల్లులతో 10 కోట్ల నిధులు పొందినట్లు ఆరోపణలున్నాయి. ఈ కేసులో పిడబ్ల్యూడీకి చెందిన ఆరుగురు ఇంజనీర్లను మే 13న ఏసీబి ప్రశ్నించింది. రోడ్స్‌ యాంటీ కరప్షన్‌ ఆర్గనైజేషన్‌ వ్యవస్థాపకులు రాహుల్‌ శర్మ ఫిర్యాదు మేరకు  ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.

 

Don't Miss