'ప్రభుత్వ విధానాలు వ్యవసాయానికి మరణశాసనం’..

18:34 - June 19, 2017

కర్నూలు : ప్రస్తుతం ఉన్న పాలకులు వ్యవసాయాన్ని చంపేస్తున్నారని కేరళ సీఎం పినరయి విజయన్ పేర్కొన్నారు. ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం 27వ రాష్ట్ర మహాసభలు కర్నూలు జిల్లాలో ప్రారంభమయ్యాయి. ఏస్ టీబీసీ కళాశాల గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పినరయి విజయన్ ప్రసంగించారు. కేంద్ర..రాష్ట్ర ప్రభుత్వాల తీరున ఎండగట్టారు. ప్రస్తుతం జరుగుతున్న పాలనలో రైతులు ఏ విధంగా కష్టపడుతున్నారో తెలియచేశారు. కర్నూలు ఏపీ రాష్ట్రానికి రాజధాని ఉండేదని, పుచ్చలపల్లి మొదటి ప్రతిపక్ష నేత ఉండడం గర్వకారణమని..కర్నూలు నగరం భిన్నమతాలకు..ప్రశాంతతకు పేరు గడిచిందన్నారు. రైతులు వెన్నెముక లాంటి వారని, కానీ వారు బ్రతికే పరిస్థితి ప్రస్తుతం లేదని ఇది ఆలోచించాల్సినవసరం ఉందన్నారు. వ్యవసాయాన్ని వదిలిపెడుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతోందని..ఆత్మహత్యలు అధికం కావడం బాధాకరమన్నారు.

1991లో నూతన ఆర్థిక విధానాలు..
1991లో గొప్ప గొప్ప నూతన ఆర్థిక విధానాలు తీసుకొచ్చామని చెప్పారని కానీ 91 తరువాత దేశంలో కోటి మంది రైతు కుటుంబాలు వ్యవసాయానికి దూరమయ్యామరని పేర్కొన్నారు. పొలంపై ఆధారపడిన రైతు కార్మికుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఆలోచించవచ్చన్నారు. 3.20 లక్షల మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారని, 2005 తరువాత రోజుకు 55 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. వ్యవసాయం రంగం ఏ విధమైన దారుణ పరిస్థితుల్లో ఉందో ఈ లెక్కలు చూస్తే సరిపోతుందన్నారు.

వ్యవసాయంపై బీజేపీకి ఆసక్తి లేదు..
యూపీఏ అనంతరం అధికారంలోకి ఎన్డీయే వచ్చిందని ఈ బీజేపీ పెట్టుబడి దారులు..మతతత్వ రాజకీయ కోసం..కార్పొరేట్ల కోసం పని చేస్తుందని, వ్యవసాయంపై ఈ సర్కార్ కు ఆసక్తి లేదన్నారు. వ్యవసాయ బడ్జెట్ ఉపయోగపడుతుందని చెప్పుకున్నారని, కానీ ఈ బడ్జెట్ లో వ్యవసాయానికి కేటాయింపులు తక్కువగా కేటాయించారని అర్థమౌతుందన్నారు. 5.1 శాతంగా ఉన్న వ్యవసాయ కేటాయింపు...3 శాతానికి పడిపోయిందన్నారు. 2011లో 3.11 శాతం ఉంటే 1.1 పడిపోయిన విషయం కనిపిస్తోందన్నారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు..వ్యవసాయ రంగానికి మరణ శాసనం అని పేర్కొనవచ్చన్నారు. వ్యవసాయ రంగంపై పెట్టుబడులు..ఖర్చులను ప్రభుత్వం తగ్గిస్తోందని..దీనితో వ్యవసాయం చేయడం కష్టమైపోతోందన్నారు. ప్రభుత్వం నుండి సహాయం లేకపోవడంతో బయటి నుండి అప్పులు తీసుకొచ్చి వ్యవసాయం చేసే దౌర్బాగ్య పరిస్థితులు నెలకొన్నాయన్నారు.

బహుళ జాతి కంపెనీలకు..
విత్తనాలపై కూడా కేంద్ర ప్రభుత్వానికి ఆసక్తి లేదని, విత్తన తయారీని బహుళ జాతీ కంపెనీలకు అప్పగించిన అనంతరం సమస్యలు అధికమయ్యారని తెలిపారు. వ్యవసాయ రంగం స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యం ఉండేదని, ప్రస్తుతం అది లేదని తెలిపారు. రైతులకు విత్తనాలు..క్రిమి సంహారాల మీద..ఎలాంటి సబ్సిడీ ఇవ్వవద్దని..ఇవ్వమని బహుళజాతి కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంటున్నారని తెలిపారు. కానీ విదేశాల నుండి మాత్రం దిగుమతులు చేయిస్తున్నారని పేర్కొన్నారు. విదేశాల నుండి మార్కెట్ లో సరుకుల ధరలు పెరిగిపోతున్నాయని, సామాన్య ప్రజలు నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి కష్టపడుతున్నారని తెలిపారు. ఆరోగ్యాలు దెబ్బతినడం..పౌష్టికాహారం లోపిస్తోందని, గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి అధికంగా కనిపిస్తుందన్నారు. పంట పండించిన పంట స్వేచ్ఛ కూడా లేకపోతోందని, ధర పెరగడమే కాదు..వ్యవసాయ రంగంపై పట్టణాలకు వలసపోవడం వల్ల విషవలయ పరిస్థితి ఏర్పడుతుందన్నారు.

రైతులను కాల్చి చంపుతారా ?
మధ్యప్రదేశ్ లో రైతులను నిర్ధాక్షిణ్యంగా కాల్చి చంపారని, గిట్టుబాటు ధర..బతకడానికి పరిస్థితులు కల్పించాలని ఆ రైతులు కోరడం జరిగిందన్నారు. బడా మీడియాకు ఇది సమస్యగా భావించలేదని..పాలక వర్గాలు..పెట్టుబడు వర్గాల పై ఆసక్తి తప్ప ఇతర ఆలోచన లేదన్నారు. వ్యవసాయ కార్మికులు..కూలీలు పని చేయకపోతే తిండి ఎవరు పెడుతారు ? ఎలా వస్తుందని ప్రశ్నిస్తూ ఉద్యమాలు చేపట్టడం జరుగుతోందన్నారు. అనంతరం జరుగుతున్న ఉద్యమాలతో రైతుల కోర్కెలు కొద్దిగా పరిశీలిస్తామని పాలకులు చెబుతున్నారని పేర్కొన్నారు.

ఎంతో మంది రక్తతర్పణం..
దోపిడిని ఎదుర్కొవడానికి వ్యవసాయ కార్మిక ఉద్యమం ప్రారంభమైందని..ఎంతో మంది రక్తతర్పణం చేశారని తెలిపారు. అమరవీరులరందరికీ జోహార్లు సమర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తే రైతుల నుండి భూములు లాక్కొంటారని దుష్ర్పచారం జరిగిందని కానీ కేరళ..బెంగాల్..తదితర రాష్ట్రాల్లో వ్యవసాయ రైతులకు రక్షణ కల్పించిందని కమ్యూనిస్టు ప్రభుత్వాలేనని స్పష్టం చేశారు. దున్నే వాడికి భూమి హక్కు కల్పించినట్లు, రైతులకు రక్షణ కల్పించడం జరిగిందన్నారు. ఏపీలో భూ సేకరణ..తదితర రూపాల్లో పేదల నుండి భూములను లాక్కొంటున్నారని తెలిపారు. వామపక్ష ప్రభుత్వాలు ఉన్న చోట రైతులకు రక్షణ ఉందని పేర్కొన్నారు. మరింత విషయాల కోసం వీడియో క్లిక్ చేయండి.

Don't Miss