కేరళను ముంచెత్తిన వానలు

09:44 - August 11, 2018

తిరువనంతపురం : కేరళను వానలు ముంచెత్తాయి. భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడి 29 మంది మృతి చెందారు. కన్నూర్, వాయినాద్, కోజికోడ్, ఇడుక్కి, ఎర్నాకులం, పతనమిట్ట, మల్లాపురం తదితర జిల్లాపై వర్షాలు తీవ్ర ప్రభావం చూపాయి. వాగులు, వంకలు పొంగిప్రవహిస్తున్నాయి. నదులు ప్రమాదకరస్థాయిలో ఉప్పొంగుతున్నాయి. 50వేల మంది నిర్వాసితులు అయ్యారు. ఇడుక్కి రిజర్వాయర్ ఐదు గేట్లను ఎత్తివేశారు. ఇడుక్కిలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నేడు స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ఎన్ డీఆర్ ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగింది. కేరళ సీఎంతో కేంద్రహోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడారు. ఎలాంటి సాయం చేయడానికైనా సిద్ధమని ప్రకటించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

Don't Miss