కేరళను వణికిస్తున్న వర్షాలు...

16:41 - August 9, 2018

కేరళ : రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడడంతో 20 మంది ప్రాణాలు గాలిలో కలసిపోయాయి. ఇడుక్కి జిల్లాలో అత్యధికంగా 11 మంది మృత్యువాత పడ్డారు. మళప్పరంలో 6గురు, కోచికూడిలో ఇద్దరు, వాయునాడులో ఒకరు మృతి చెందారు. పాలక్కాడ్, వాయునాడ్, కోచికూడిలో కొందరు గల్లంతయ్యారు. తెల్లవారుజామునుండి భారీ వర్షాలు కురుస్తుండడంతో వాగులు..వంకలు పొంగి పొర్లుతున్నాయి. పెరియార్ నది ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తోంది. ఇడుక్కి రిజర్వాయర్ లో నీటి మట్టం పెరిగిపోవడంతో 22 గేట్లను ఎత్తివేశారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమలమయ్యాయి. ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్ బృందం సహాయక చర్యలు చేపట్టింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో స్కూళ్లు..కళాశాలలకు సెలవు ప్రకటించారు. 

Don't Miss