వినాయక నిమజ్జనం విశేషాలు..

09:22 - September 5, 2017

హైదరాబాద్ : నగరంలో వినాయక నిమజ్జన కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో జరుగుతోంది. గతంతో పోలిస్తే నిమజ్జన కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి. అందుకు ప్రభుత్వం..పోలీసులు..ఇతర అధికారుల సమన్వయంతో నిమజ్జన కార్యక్రమం జరుగుతోంది. హుస్సేన్ సాగర్ వద్ద నిమజ్జనానికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్టీఆర్ మార్గంలో 9 క్రేన్ లు ఏర్పాటు చేయగా మిగతా క్రేన్ లను బుద్ధుడు ఎదురుగా ఉన్న స్థలంలో ఏర్పాటు చేశారు. ప్రతి ఏడాది లాగే ఖైరతాబాద్ భారీ వినాయకుడు క్రేన్ నెంబర్ 4 వద్ద నిమజ్జనం జరుగనుంది.

క్రేన్ సామర్థ్యం ఇదే...
ఖైరతాబాద్ గణేశుడిని నిమజ్జనం చేసే క్రేన్ అత్యంత శక్తివంతమైంది. 12 ఏళ్లుగా రవి క్రేన్ సర్వీసుకు చెందిన భారీ క్రేన్‌ను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రేన్ జర్మనీ నుంచి దిగుమతి అయ్యింది. 60 ఫీట్ల పొడువు, 11 అడుగుల వెడల్పు, 110 టన్నుల బరువు, 12 టైర్లతో రూపుదిద్దుకుంది. ఈ క్రేన్ 150 టన్నుల బరువును ఎత్తనుంది.

ఎంజే మార్కెట్..
ఎంజే మార్కెట్ లో నివాసాల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు ప్రజలు వెళుతున్నారు. ద్విచక్ర వాహనాలు..కార్లలో తమ వినాయక విగ్రహాలను తీసుకెళుతున్నారు. డప్పు..వాయిద్యాల నడుమ డ్యాన్స్ లు చేస్తూ సందడిగా తరలివెళుతున్నారు.

ఖైరతాబాద్ గణనాథుడు..
ఖైరతాబాద్ గణనాథుడు శోభయాత్ర కొనసాగుతోంది. ఉదయమే ప్రారంభమైన ఈ యాత్ర కాసేపటి క్రితం టెలిఫోన్ భవనం వద్దకు చేరుకుంది. అనంతరం సెక్రటేరియట్ మార్గం గుండా ట్యాంక్ బండ్ కు చేరుకోనుంది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

Don't Miss