ఎగ్జైటింగ్‌గా ఉందన్న కైరా..

10:17 - August 12, 2017

'ఎం.ఎస్‌.ధోనీ: ది అన్‌టోల్డ్ స్టోరీ’ మూవీ తో ప్రేక్షకులను అలరించిన 'కైరా అడ్వాణీ' ప్రస్తుతం తెలుగు సినిమాలో నటిస్తోంది. 'మహేష్ బాబు – కొరటాల శివ' కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘భరత్ అను నేను’ అనే మూవీ లో కైరా నటిస్తున్న సంగతి తెల్సిందే. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ కొనసాగుతోంది. రాజకీయ నేపథ్యంలో సినిమా ఉంటుందని..సీఎంగా మహేష్ బాబు నటిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇటీవలే రాజకీయాలపై కొరటాల సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ చిత్రం గురించి కైరా అడ్వాణీ మీడియాతో ముచ్చటించారు. మహేశ్‌బాబుతో కలిసి నటించడం ఓ గొప్ప అవకాశమని పేర్కొన్నారు. తాజాగా ముంబయి బాంద్రాలోని ఓ నూతన దుకాణాన్ని ఆమె ప్రారంభించారు. ఇది నా తొలి తెలుగు చిత్రమని, ఆయనతో, విజయవంతమైన చిత్రాల్ని అందించిన కొరటాల శివతో కలిసి పనిచేయడం ఓ గొప్ప అవకాశమన్నారు. ప్రకాశ్‌రాజ్‌, శరత్‌కుమార్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతికి ఈ సినిమా విడుదల కాబోతోందని తెలుస్తోంది.

Don't Miss