మామిడి..కింగ్ ఆఫ్ ఫ్రూట్..

12:10 - April 19, 2017

వేసవికాలం వచ్చిందంటే చాలు మామిడికాయలతో మార్కెట్ కళకళలాడుతుంటుంది. బంగారం వర్ణంలో మెరిసే మామిడి పండ్లు అంటే ఎవరికైనా మక్కువే. మామిడి తినడం వల్ల పలు ప్రయోజనాలు కలిగి ఉంటాయి. మరి మామిడిలో ఏముంటాయి ? మామిడి పండు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలిగి ఉంటాయో చూడండి..

  • మామిడిలో వంద క్యాలరీల శక్తి ఉంటుంది. ఒక గ్రాము ప్రోటీన్లు, 0.5 గ్రాముల కొవ్వులు, 25 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 23 గ్రాముల చక్కెర, 3 గ్రాముల పీచు, ఒక రోజుకు ఒక మనిషికి అవసరమైనన్ని విటమిన్లు ఉంటాయని వైద్యులు పేర్కొంటుంటారు.
  • మామిడిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. మలబద్ధకం సమస్య పరిష్కారవుతుంది.
  • పెద్దపేగుకు క్యాన్సర్‌ వచ్చే అవకాశాలను సమర్థంగా నివారిస్తుంది.
  • ఇది క్వేర్సిటిన్, ఐసోక్వేర్సిటిన్, ఆస్ట్రగాలిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్'ని కలిగి ఉంటుంది.
  • క్యాన్సర్ కారకాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. అంతేకాకుండా కొవ్వు పదార్థాలను సరియగు పాళ్ళలో వుంచి, చర్మాన్ని సురక్షితంగా ఉంచుతుంది.
  • కంటిచూపును మెరుగుపరిచేందుకు అవసరమైన బీటా–కెరటిన్‌ మామిడిలో పుష్కలంగా ఉంటుంది.
  • ఎక్కువ సమయం ఆకలి కాకుండా చేస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.
  • మామిడిలోని బీటా కెరొటిన్‌ పోషకమే ప్రోస్టేట్‌ క్యాన్సర్‌తో పాటు... రొమ్ము, లుకేమియా వంటి అనేక క్యాన్సర్ల నివారణకూ తోడ్పడుతుంది.
  • మామిడి పండ్లలో ఉండే పొటాషియం హార్ట్ రేటును కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. మరియు బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది.
  • విటమిన్ బి 6 మతిమరుపును నివారిస్తుంది. నార్మల్ నర్వ్ ఫంక్షన్ ను మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది.

Don't Miss