రంగు రంగుల పతంగులు...

14:01 - January 13, 2018

హైదరాబాద్ : సీఎం కేసీఆర్, ప్రధాని మోడీ.. బాహుబలి ప్రభాస్‌లు పోటీకి సిద్ధంగా ఉన్నారు. చోటా భీం, స్పైడర్ మ్యాన్, డోరెమాన్‌లు కూడా పోటీకి సై అంటున్నారు. ఇంతకీ దేని కోసం వీరంతా పోటీ పడుతున్నారు? తెలుసుకోవాలని ఉందా? అయితే ఓ లుక్కేయండి. కేసీఆర్, మోడీ, ప్రభాస్‌... చోటా భీం.. స్పైడర్ మ్యాన్, డోరెమాన్... వీరంతా ఇప్పుడు పతంగుల పోటీలో ఉన్నారు. హైదరాబాద్ ధూల్‌పేట మార్కెట్లో కొలువు దీరిన గాలిపటాలపై దర్శనం ఇస్తున్నారు. 

సంక్రాంతి పండుగ అనగానే హైదరాబాదీలకు ముందుగా గుర్తుకొచ్చేవి రంగు రంగుల పతంగులు.. ఇక పతంగులకు పెట్టింది పేరైన ధూల్‌పేట ప్రాంతం. ఇప్పుడు అక్కడ గాలి పటాల తయారీ, అమ్మకాలు ఊపందుకున్నాయి. ఎటు చూసినా రంగు రంగుల వెరైటీ పతంగులు కనువిందు చేస్తున్నాయి. ధర ఎంతైనా.. సంక్రాంతిని మాత్రం కలర్‌ఫుల్‌గా జరుపుకునేందుకు నగర వాసులు సిద్ధమవుతున్నారు. 

సంక్రాంతి పండుగ ఇంకా కొద్ది రోజుల వ్యవధి మాత్రమే ఉండడంతో సిటీలో గాలిపటాల కొనుగోళ్లు మొదలయ్యాయి. హోల్ సేల్ రిటైట్ మార్కెట్లో డిమాండ్ సరిపడా పతంగుల అమ్మకాలు ఊపందుకున్నాయి. గత ఏడాదితో పోలీస్తే ఈఏడాది మార్కెట్లో  వెరైటి అండ్ లేటెస్ట్ డిజైన్స్ ఫాన్సీ పతంగులు చిన్నారులను, నగరయువతను కనువిందు చేస్తున్నాయి. ధూల్‌పేటలో నెల ముందు నుంచే పతంగుల తయారీ, అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఈసారి హైదరాబాద్‌ మార్కెట్లో  చైనా, బనారస్, ఢిల్లీ, రాజస్ధాన్, జైపూర్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో ఫేమస్ అయిన వెరైటీ డిజైన్ల పతంగులు కొలువుదీరాయి

వెరైటి కాగజ్, గిల్లోరా చాంద్, గిల్లోరా డోప్పన్, గిబియా, దూలా, ధూలెన్, చంద్ర, సీఎం కేసీఆర్, ప్రధాని మోడీ, బాహుబలి క్లాత్ పతంగులతో పాటు టీం ఇండియా, బటర్ ఫ్లై, కార్టున్స్, చోటా భీం, బెన్ టన్, స్పైడర్ మాన్, డోరిమాన్, మిక్కి మౌజ్, మోటూ పత్లూ ఫాన్సీ చిత్రాలతో రూపొందించిన పతంగులు మార్కెట్లో కనువిందు చేస్తున్నాయి. అయితే తాంగుస్ మాంజా, మొనోపలీ ప్లాస్టిక్ మాంజాలు నగరంలో బహిష్కరించడంతో చేతితో చేసిన మాంజా, గీటి మాంజాకు డిమాండ్ పెరిగింది. అన్నం అలువెరా, సీసం పొడి, కలర్లు, వంకాయ చింతపండుతో నూరి తయారు చేస్తున్న మంజాలకు ధూల్ పేట్ లో ఎగుమతి అధికంగా ఉంది. పావ్ పాండ్, ఆదా పాండ్, ఏక్ పాండ్, దో పాండ్ నైట్ కైట్స్, క్లాత్ కైట్స్  భారీ పతంగులు  కోనుగోలుకు సిద్ధంగా ఉంచారు. . 15 రూపాయల నుంచి 100 రూపాయల దాకా వెరైటీ పతంగులు, 50 రూపాయల నుంచి 3వేల దాకా కాస్ట్లీ మాంజాలు అందుబాటులో ఉన్నాయి. తమ వ్యాపారంపై ధరల ప్రభావం ఎలా ఉన్న నిర్ణయించిన ధరలకే పతంగులను మాంజాలను విక్రయిస్తున్నారు వ్యాపారులు. ఈ ఏడాది చాలా వెరైటీ ఐటమ్స్ అందుబాటులో ఉంచామని ధూల్‌పేట్ వ్యాపారులు చెబుతున్నారు. పతంగుల అమ్మకాలు ఊపందుకోవడంతో భాగ్యనగరంలో సందడి పెరిగింది. సంక్రాంతి సందర్భంగా పతంగులను ఎగురవేసేందుకు చిన్నారులు ముచ్చటపడుతున్నారు. 

Don't Miss