టీజేఎస్‌కు బలమైన అభ్యర్థులున్నారు - కోదండరాం...

12:47 - November 5, 2018

హైదరాబాద్ : తెలంగాణ జనసమితి ఎన్నికల విషయంలో వేగంగా అడుగులు వేస్తోంది. మహాకూటమి ఏర్పాటుకు వేగవంతమైన చర్యలు తీసుకోవాలని టీజేఎస్ వ్యవస్థాపకుడు కోదండరాం పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీకి సంబంధించిన గుర్తు (అగ్గిపెట్టె), మేనిఫెస్టోను విడుదల చేశారు. Image result for tjs party symbolసంపూర్ణంగా మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగిందని, కానీ ఎన్నికల కోడ్ ఉండడంతో బహిర్గతం చేయడం లేదన్నారు. కాపీలను ఎన్నికల సంఘానికి పంపిస్తున్నామని, మూడు రోజుల అనంతరం మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళుతామన్నారు. దీనితోపాటు ఆయన ఎన్నికల ప్రణాలిక కాపీనీ మీడియా ఎదుట విడుదల చేశారు. 
పొత్తులు..సీట్ల ఖరారు విషయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులను తాము కలవడం జరిగిందని, సోమవారం కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలను కలవడం జరుగుతుందని వెల్లడించారు. పొత్తులు..సీట్ల ఖరారు విషయంలో చర్చించడం జరుగుతుందని, దీనికి తుదిరూపు వచ్చే అవకాశం ఉందన్నారు. పది సీట్లలో పోటీ చేయాలనే లక్ష్యంతో ఉన్నామని, మరో మూడు సీట్లలో బలమైన అభ్యర్థులున్నారని..ఈ విషయాన్ని ఆలోచించాలని కాంగ్రెస్‌ను కోరడం జరుగుతుందన్నారు. దీపావళి నాటికి పొత్తులు, సీట్ల ఖరారుపై ప్రకటన చేయడం జరుగుతుందన్నారు. 
మహాకూటమి విషయంలో కొంత ఆలస్యం జరిగిందని, విజయదశమి నాటికి తేలాల్సిన పొత్తులు..తేలలేదని..జాప్యం జరగకపోతే ఈ సమయంలో ప్రచారం పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉండేదన్నారు. దీనితో పలువురు నేతలు అసంతృప్తికి గురి కావడం జరిగిందన్నారు. కానీ వీలైనంత తొందరలో పొత్తులు..సీట్ల ఖరారు జరిగే అవకాశం ఉందని కోదండరాం వెల్లడించారు. 

Don't Miss