ఎంగేజ్ మెంట్ లేదన్న కోహ్లీ..

12:06 - December 30, 2016

టీమిండియా స్టార్ ఆటగాడు 'విరాట్ కోహ్లీ'..బాలీవుడ్ నటి 'అనుష్క శర్మ' లు ఎంగేజ్ మెంట్ చేసుకుంటున్నారంటూ వస్తున్న వార్తలు నిజం కాదని తేలిపోయింది. గత కొద్ది రోజులుగా వీరు ప్రేమలో మునిగిపోతున్న సంగతి తెలిసిందే. క్రిస్మస్ సందర్భంగా ఉత్తరాఖండ్ కు వెళ్లిన ఈ జంట త్వరలోనే ఎంగేజ్ మెంట్ చేసుకోబోతున్నట్లు సోషల్ మాధ్యమాల్లో తెగ ప్రచారం జరిగింది. న్యూ ఇయర్ సందర్భంగా కోహ్లీ - అనుష్కలు ఉంగరాలు మార్చుకొననున్నట్లు వార్తలు వెలువడ్డాయి. దేశంలోని ప్రముఖ ఛానల్స్ ఈ న్యూస్ ను ప్రచారం చేశాయంట. ఉత్తరాఖండ్ లోని నరేంద్ర నగర్ లోని ఆనంద హోటల్ ఇందుకు వేదిక కానున్నట్లు కథనాలు వెలువడ్డాయి. అంబానీ..బచ్చన్..కపూర్ కుటుంబాలు..బాలీవవుడ్..క్రికెట్ సెలబ్రిటీలు హాజరు కానున్నట్లు పుకార్లు షికార్లు చేశాయి. ఒక్కసారిగా జరిగిన ఈ ప్రచారంతో 'కోహ్లీ' స్పందించాల్సి వచ్చింది. 'అనుష్క శర్మ'తో ఎంగేజ్ మెంట్ వార్త‌లు అవాస్త‌వం అని ట్విట్ట‌ర్ ఖాతాలో 'కోహ్లీ' ట్వీట్ చేశాడు. తాను ఎంగేజ్ మెంట్ వేడుక చేసుకుంటే అన్ని వివ‌రాలు వెల్ల‌డిస్తాను క‌దా? అని 'కోహ్లీ' ప్రశ్నించాడు. కోహ్లీ చేసిన ట్వీట్స్ తో ఎంగేజ్ మెంట్ లేదనే విషయం స్పష్టమైంది.

Don't Miss