కోర్టు ధిక్కరణ పిటీషన్ వేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..

17:40 - June 12, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్ లో అసెంబ్లీ సభ్యత్వాలను పునరుద్ధరించాలని హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీనిపై కాంగ్రెస్ పలు విధాలుగా డిమాండ్ చేస్తోంది. గవర్నర్ , స్పీకర్ మధుసూధనాచారి దృష్టికి తీసుకువెళ్లారు. కానీ ఎటువంటి స్పందనా రాకపోవటంతో కాంగ్రెస్ పార్టీ తిరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. డివిజన్ బెంచ్, సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పులను ఖాతరు చేయకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ మరోసారి కోర్టు ధిక్కరణ పిటీషన్ ను హైకోర్టులో దాఖలు చేసింది. దీనిపై వచ్చే శుక్రవారం నాడు కోర్టు విచారణ చేపట్టనుంది.

శాసనసభ్యత్వాలను వెంటనే పునరుద్ధరించకుంటే భారీ ఉద్యమం : కాంగ్రెస్
హైకోర్టు తీర్పును గౌరవిస్తూ కాంగ్రెస్‌ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ శాసనసభ్యత్వాలను వెంటనే పునరుద్ధరించాలని సీఎల్‌పీ డిమాండ్‌ చేసింది. ఈ విషయంలో వారం రోజుల్లో తుది నిర్ణయం తీసుకోకపోతే టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ప్రజా ఉద్యమం నిర్మిస్తామని కాంగ్రెస్‌ నేతలు హెచ్చరించారు. ఈ విషయంపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఫిర్యాదు చేస్తామని అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనాచారిని కలిసిన తర్వాత కాంగ్రెస్‌ నాయకులు చెప్పారు. 

Don't Miss