కృష్ణవంశీ డైరెక్షన్ లో హరర్ థ్రిల్లర్?!..

16:03 - April 5, 2018

కృష్ణవంశీని సక్సెస్ పలకరించి చాలా కాలం అయింది. క్రియేటివ్ డైరెక్టర్ గా ఒకప్పుడు కృష్ణవంశీ వరుస విజయాలను అందుకున్నాడు. కానీ గతకొంతకాలంగా సక్సెస్ ఆయనమీద అలిగినట్లుగా కనిపిస్తోంది. నాచ్యురల్ స్టార్ నానితో చేసిన పైసా సినిమా పేరు పరంగా మంచి టాక్ వచ్చినా..మొగుడు, గోవిందుడు అందరివాడేలే..ఇటీవల వచ్చిన కృష్ణవంశీ ఆఖరి సినిమా నక్షత్రం వంటి సినిమాలు కూడా ఆయనకు హిట్ తేలేకపోయాయి. అప్పటి నుంచి కూడా తదుపరి ప్రాజెక్టును గురించి ఆయన నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే ఆయన నుంచి ఒక భారీ హారర్ థ్రిల్లర్ రానుందనే టాక్ తాజాగా వినిపిస్తోంది.

40 కోట్లతో భారీ హర్రర్ థ్రిల్లర్..
'నక్షత్రం' సినిమాకి ముందే కృష్ణవంశీ ఒక హారర్ థ్రిల్లర్ చేయాలనుకున్నా కుదరలేదట. ఆ సినిమాకి 'రుద్రాక్ష' అనే పేరు పెడుతున్నట్టుగా కూడా అప్పట్లో వంశీ ప్రకటించారు. కానీ ఎందుకనో ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఇప్పుడా కథను పట్టాలెక్కించే పనిలో ఈ క్రియేటివ్ డైరెక్టర్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కథకు దాదాపు 40 కోట్లు ఖర్చు కావొచ్చని టాక్. దాంతో గట్టి నిర్మాత కోసం కృష్ణవంశీ ప్రయత్నిస్తున్నాడని అంటున్నారు. మొత్తానికి 'రుద్రాక్ష' కృష్ణవంశీకి గొప్ప సక్సెస్ ని ఇవ్వాలని ఆశిద్దాం..

హీరోల నటనను మెరుగుపరిచే కృష్ణవంశీ..
ఆయన హీరోలు ఆయన సినిమాలో నటించినన తరువాత అంతకు ముందు నటించిన సినిమాలను గమనిస్తే..నటనలో మెరుగుపడిన తీరును గమనించవచ్చు. నటుడిలో వుండే నటనను వెలికితీయటం కూడా క్రియేటివిటీలో భాగమే..కుటంబ కథా చిత్రాలలో నటించటం వేరు యాక్షన్ చిత్రాలలో నటించటం వేరు. సాధారణంగా కృష్టవంశీ కుటుంబాలలో వుండే సెంటిమెంట్ కు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. అందుకే ఆయన సినిమాలో నటించిన తరువాత హీరోరు అసలైన నటనను కనబరుస్తారు. అందుకే దటీజ్ కృష్ణవంశీ అనే క్రియేటివిటీ డైరెక్టర్ అనిపించుకున్నారు. ఆయన క్రియేషన్ ప్రతీ షాట్ లోను కనిపిస్తుంది. ప్రేక్షకులను అలరిస్తుంది. అటువంటి కృష్ణవంశీ హరర్ థ్రిల్లర్ వస్తే అది ఖచ్చితంగా ప్రేక్షకులను అలరించి తీరుతుందని సినిమా అభిమానులు ఆశిస్తున్నారు. 

Don't Miss