కుల్ భూషణ్ జాదవ్ మరణ శిక్షపై స్టే

16:09 - May 18, 2017

హైదరాబాద్: మాజీ నేవీ అధికారి కుల్‌ భూషణ్‌ జాదవ్‌ కు పాకిస్థాన్ ఆర్మీ కోర్టు విధించిన మరణ శిక్షణ ను అంతర్జాతీయ న్యాయస్థానంలో స్టే విధించింది. అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానంలో ఈ రోజు మధ్యంతర తీర్పు వెలువ‌డింది. 'ది హేగ్' ‌నగరంలోని అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానంలో ఈ తీర్పును 11 మంది న్యాయ‌మూర్తుల ధ‌ర్మాస‌నం వెల్ల‌డించింది. కుల్‌భూష‌ణ్ జాద‌వ్ కేసు అంశంపై పాకిస్థాన్ చేస్తోన్న వాదనలు సరికావని అంతర్జాతీయ న్యాయస్థానం అధ్యక్షుడు రోన్నే అన్నారు. వియన్నా ఒప్పందం ప్రకారం కుల్‌భూష‌ణ్ జాద‌వ్‌ను క‌లిసే హ‌క్కు భార‌త్‌కు ఉంద‌ని తెలిపారు. వియన్నా ఒప్పందంపై భారత్, పాకిస్థాన్ భాగస్వాములని ఆయన గుర్తు చేశారు. ఈ కేసు అంతర్జాతీయ న్యాయస్థానం పరిధిలోకి రాదన్న పాకిస్థాన్ వాదనను తాము తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. పాకిస్థాన్ లో జాదవ్ ను కలుసుకునేందుకు భారత దౌత్య అధికారులకు అనుమతి ఇవ్వాలని తెలిపారు. తమ నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు స్టే కొనసాగుతుందని చెప్పారు.

Don't Miss