ఏసీబీ వలకు చిక్కిన అవినీతి చేప

20:29 - January 25, 2018

శ్రీకాకుళం : జిల్లాలోని ఎచ్చెర్ల మండలంలో అవినీతి చేప ఏసీబీ వలకు చిక్కింది. పాపులేషన్‌ సర్టిఫికేట్‌ జారీ చేసేందుకు లంచం డిమాండ్‌ చేసి అడ్డంగా బుక్కయ్యాడు కుశాలపురం పంచాయితీ కార్యదర్శి కుర్మారావు. ఎచ్చెర్ల మండలం ఫరీదుపేట పంచాయితీకి చెందిన సీపాన దిలీప్‌ కుమార్‌ పాపులేషన్‌ సర్టిఫికేట్‌ కోసం దరఖాస్తు చేసుకోగా కుర్మారావు పదివేలు లంచం డిమాండ్‌ చేశాడు. దీంతో దిలీప్‌ కుమార్‌ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఏసీబీ అధికారులు కుర్మారావును లంచం తీసుకుంటుంగా పట్టుకున్నారు. ఇతనితో పాటు గుమస్తాను కూడా అదుపులోకి తీసుకొని ఆరువేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరిని విశాఖలోని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. 

 

Don't Miss