సంగారెడ్డిలో మట్టిపెళ్లలు విరిగిపడి...

13:12 - May 8, 2018

సంగారెడ్డి : జిల్లాలో విషాదం నెలకొంది. నిర్మాణ రంగంలో పనిచేస్తున్న ముగ్గురు కార్మికులు మృతి చెందారు. ఈ ఘటన జిల్లాలోని వెలిమలలో చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లాలో నిర్మాణ రంగం ఊపందుకుంది. నిర్మాణాలు చేపడుతున్న కాంట్రాక్టర్లు ఛత్తీస్ గడ్, ఒడిశా తదితర రాష్ట్రాల నుండి తక్కువ ధరకు కూలీలను తెప్పించుకుని పనులు చేయించుకుంటున్నట్లు సమాచారం. ఓ స్కూల్ లో పనులు చేపడుతున్న ఓ కాంట్రాక్టర్ ఒడిషా రాష్ట్రం నుండి కూలీలను తెప్పించుకుని పనులు చేపిస్తున్నారు. స్కూల్ లో పైపు పనులు చేపడుతుండగా ప్రమాదవశాత్తు మట్టిపెళ్లలు విరిగిపడి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించినట్లు సమాచారం. ఎలాంటి రక్షణ లేకుండా కూలీలు పని చేస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

Don't Miss