మహేష్ టవల్స్ ను లారా ఏం చేసిందో తెలుసా ?

11:18 - August 30, 2017

ఇంట్లోకి వర్షపు నీళ్లు వస్తే ఏం చేస్తారు ? ఏం చేస్తాం..అడ్డుగా ఏదో ఒకటి పెట్టేస్తాం..అంటారు కదా...కానీ ఏదైనా ఓ వ్యక్తి ఇష్టంగా దాచుకున్న వాటిని ఉపయోగించి నీరు లోనికి రాకుండా చేస్తే ఎలా ఉంటుంది...అలా ఎలా చేస్తాం..ఇష్టంగా దాచుకున్న వాటితో అలా చేస్తామా ? అంటారు కదా..కానీ ప్రముఖ టెన్నిస్ స్టార్ మహేష్ భూపతి సతీమణి లారా దత్తా అలాగే చేసింది...ఎంటో తెలుసుకోవాలంటే..చదవండి..

మహేష్ భూపతి..ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు..వింబుల్డన్..ఆస్ట్రేలియన్..యూఎస్..ఫ్రెంచ్ ఓపెన్లు ఎన్నో మ్యాచ్ లను ఆడాడు. బాలీవుడ్ మాజీ నటి, 2000విశ్వసుందరి లారా దత్తాను ఆయన వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరు ముంబైలో నివాసం ఉంటున్నారు. మ్యాచ్ ల్లో ఆడిన సందర్భంలో ఉపయోగించిన టవల్స్..ను మహేష్ భూపతి మధురస్మృతులుగా దాచుకున్నాడు.

గత కొన్ని రోజులుగా ముంబై నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనితో వరదనీరు నగరాన్ని ముంచెత్తింది. సామాన్యుడి నుండి ప్రముఖుల వరకు ఎంతో మంది వరద నీటితో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మహేష్ భూపతి..లారా దత్తాలు ఉంటున్న నివాసంలోకి కూడా వరద నీరు చేరింది. దీనితో మహేష్ దాచుకున్న టవల్స్ ను నీరు రాకుండా అడ్డు పెట్టింది. దీనికి సంబంధించిన ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది. ఇలాగైనా పనికొచ్చాయని కామెంట్ కూడా పెట్టారు. దీనిపై మహేష్ వెంటనే బదులిచ్చాడు. ఎంత పనిచేశావు ? వేళాకోళంగా ఉందా ? ఎంత కష్టపడ్డానో తెలుసా ? అంటూ ట్విట్టర్ లోనే బదులిచ్చాడు. 

Don't Miss