ఉమ్మడి హైకోర్టు విభజనపై ఏపీ తరపున వాదించనున్నలాయర్ పాలి నారిమన్

16:28 - September 13, 2018

హైదరాబాద్ : ఉమ్మడి హైకోర్టు విభజనపై సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ తరఫున వాదించేందుకు సీనియర్ న్యాయవాది పాలి నారిమన్ ను ఏపీ ప్రభుత్వం నియమించింది. అందుకు గానూ నారిమన్ కు 33 లక్షల ఫీజు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. సుప్రీంకోర్టులో ఏపీ తరఫున పాలి నారిమన్ వాదించనున్నారు. శుక్రవారం సుప్రీంకోర్టులో ఉమ్మడి హైకోర్టు విభజన విచారణకు రానుంది. ఉమ్మడి హైకోర్టు విభజనపై గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. 

 

Don't Miss