‘లీడర్' సీక్వెల్ వస్తోందంట...

09:05 - November 8, 2017

శేఖర్ కమ్ముల...బాలీవుడ్ బాహుబలి 'రానా' హీరోగా వచ్చిన 'లీడర్' సినిమా మంచి పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. రాజకీయ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా 'రానా'కు మొదటి సినిమా. 2010లో వచ్చిన ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుందని ప్రచారం జరుగుతోంది. ఇటీవలే 'శేఖర్ కమ్ముల' దర్శకత్వంలో వచ్చిన 'ఫిదా' ఘన విజయం సాధించింది. దీనితో ఇతర చిత్రాలపై ఆయన దృష్టి సారించారు.

రాజకీయాలపై చిత్రం తీయాలని..శేఖర్ కమ్ముల భావిస్తున్నట్లు ఇందుకు స్ర్కిప్ట్ కూడా సిద్ధం చేసుకున్నారని టాలీవుడ్ టాక్. ఇందుకు 'లీడర్' కు సీక్వెల్ తీయాలని..అదీ 'రానా'తోనే తీస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ అనుకున్నట్టు అన్నీ జరిగితే త్వరలో ఈ సినిమా పట్టాలెక్కనుంది. ప్రస్తుతం రానా '1945' చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. 

Don't Miss