కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేయాలి : వామపక్షనేతలు

17:46 - July 6, 2018

కడప : విభజన హామీ చట్టంలో ఇచ్చిన విధంగా కడపలో ఉక్కుపరిశ్రమ ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన చేయాలని..ఆ తర్వాతే కడపలో బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ  అడుగుపెట్టాలన్నారు వామపక్ష నేతలు.  కేంద్ర ప్రభుత్వం జిల్లాలో ఉక్కుపరిశ్రమ ఏర్పాటుకు ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను కూడా కేంద్రం తుంగలో తొక్కిందని ఆరోపించారు. వెంటనే జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకై స్పష్టమైన ప్రకటన చేయాలని లేని పక్షంలో బీజేపీ అధ్యక్షుడు కన్నా పర్యాటనను అడ్డుకుంటామని వామపక్ష నేతలు హెచ్చరించారు.

 

Don't Miss