స్పీకర్ ను అడ్డుకున్న వామపక్ష నేతలు..

12:29 - February 15, 2018

అనంతపురం : జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన స్పీకర్ కోడెల శివప్రసాద్ ను వామపక్ష నేతలు..న్యాయవాదులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ వారు డిమాండ్ చేశారు. అక్కడనే ఉన్న పోలీసులు వామపక్ష నేతలు, న్యాయవాదులను అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట వాగ్వాదం చోటు చేసుకుంది. స్థానిక ఎమ్మెల్యే జోక్యం చేసుకుని ఆందోళన చేస్తున్న వారిని శాంతింప చేసే ప్రయత్నం చేశారు. ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనేందుకు స్పీకర్ రావడం జరిగిందని, కార్యక్రమం అనంతరం స్పీకర్ ను కలిపించే ప్రయత్నం చేస్తానని హామీనివ్వడంతో వామపక్షాలు..న్యాయవాదులు శాంతించారు.

అనంతరం కార్యక్రమం ముగిసిన అనంతరం స్పీకర్ కోడెల వచ్చి వామపక్షాలు..న్యాయవాదులతో మాట్లాడారు. వారు ఇచ్చిన వినతిపత్రం స్వీకరించారు. వెనుకబడి ఉన్న రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేస్తే లాభం ఉంటుందని..దీనిపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళుతానని స్పీకర్ కోడెల వారికి తెలిపారు. 

Don't Miss