నిమ్మతో క్లీన్...

15:23 - September 19, 2017

నిమ్మ..ఆరోగ్యానికి..వంటలకే కాదు..ఇల్లు క్లీనింగ్ కు కూడా ఉపయోగపడుతుంది. ఎన్నో వంటకాల్లో నిమ్మను ఉపయోగిస్తుంటారు. ఆరోగ్యానికి కూడా నిమ్మరసం ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి ఇంటిని ఎలా క్లీన్ గా ఉంచుకోవచ్చు ?

కొన్ని ప్రాంతాల్లో మరకలు ఎంతగాను వదలవు. అలాంటి సమయంలో నిమ్మ చక్కగా ఉపయోగపడుతుంది. నివాసంలో తలుపులు..కిటీకిలు..సింక్ లలో దుమ్ము పేరుకపోతుంది. దీనిని తొలగించాలంటే ఓ మగ్గు నీళ్లలో నిమ్మరసం వేసి ఇందులో కొద్దిగా బేకింగ్ సోడా వేయాలి. కాటన్ బట్టను నీళ్లలో ముంచి కిటీకి..తలుపులు..సింక్ లను తుడిచి చూడండి. నాన్ వెజ్ వంటకాలు వండిన తరువాత పాత్రలను కడుగలేక అవస్థలు పడుతుంటారు. పాత్రలకు ఉండే జిడ్డు..వాసన ఒక పట్టాన పోదు. అందుకు నిమ్మరసం..వెనిగర్ కలిపిన నీటితో పాత్రలను ముందుగా రుద్దాలి. అనంతరం గోరువెచ్చని నీటితో కడిగేయాలి. అంతే జిడ్డుతో పాటు వాసన మటుమాయం. వంటగదిలోని సింక్ అపరిశుభ్రంగా ఉంటే రెండు నిమ్మకాయల రసం తీసుకోవాలి. ఈ రసాన్ని..దొడ్డుప్పును సింక్ లో మొత్తం చల్లి ఏదైనా బ్రష్ తో రుద్దాలి. అనంతరం గోరువెచ్చని నీటితో కడిగేయాలి. 

Don't Miss