ఉదయాన్నే నిమ్మరసం తాగితే...

11:19 - February 10, 2017

నిమ్మరసం..పరిగడుపన తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు దాగున్నాయి. కానీ చాలా మంది సేవించడానికి వెనుకాడుతుంటారు. ఇందులో విటమిన్ సితో పాటు శరీరానికి అవసరమయ్యే కీలక పోషకాలు కూడా నిమ్మ వల్ల మనకు లభిస్తాయి. సౌందర్య సాధనంగా కూడా ఉపయోగపడే నిమ్మ ఆరోగ్యకరపరంగా ఉపయోగపడుతుంది. మరి నిమ్మకాయ రసం తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు దాగున్నాయో చూద్దాం...

  • జీర్ణ సమస్యలను తగ్గించడంలో నిమ్మకు మించినది మరొకటి లేదు.
  • శరీరంలోని లవణ శాతాన్ని పెంచి, వ్యాధినిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
  • గోరువెచ్చని నీటిలో కూడా సేవించవచ్చు. ఇందులో కొన్ని అల్లం ముక్కలు, ఒక నిమ్మకాయ రసం, టీ స్పూన్ తేనె కలుపుకుని తాగడం వల్ల జీర్ణక్రియ సజావుగా సాగుతుంది.
  • చర్మానికి మేలు చేసే విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది. దీనివల్ల వ్యాధికారక క్రీముల తాకిడికి చర్మం తట్టుకుంటుంది.
  • చర్మంపై ఏర్పడే ముడతల సమస్యలు దూరం చేస్తుంది. వృద్ధాప్య ఛాయలు దరిచేరవు. యాంటీ ఏజింగ్ ఏజెంట్‌గా నిమ్మరసం పనిచేస్తుంది.
  • క్యాన్సర్ కణాల వృద్ధి ఆగుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండడం వల్ల క్యాన్సర్ కణాలు నాశనం అవుతాయి.
  • కిడ్నీల్లో ఉండే రాళ్లు కరిగిపోతాయి. రాళ్లు ఏర్పడేందుకు అవకాశం తక్కువగా ఉంటుంది.
  • బరువు తగ్గాలనుకునే వారికి మెరుగైన ఫలితాలను ఇస్తుంది. కొవ్వును కరిగించే గుణాలు నిమ్మలో ఉన్నాయి.
  • అల్కాహాల్ తీసుకోవడం ద్వారా లివర్ పై ప్రభావం పడుతుంది. ఒక గ్లాస్ నిమ్మరసం తీసుకోవడం ద్వారా లివర్ ను ఆ ప్రభావం నుండి తప్పించి లివర్ ఫంక్షన్ ను వేగవంతం చేస్తుంది.

Don't Miss