ప్రేమపేరుతో వేధింపులు.... విద్యార్థిని ఆత్మహత్య

12:51 - December 15, 2016

రంగారెడ్డి : ప్రేమపేరుతో వేధింపులు తాళలేక ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట్‌ మండలం లక్ష్మాపూర్‌ గ్రామానికి చెందిన శరణ్య... కేశవరంలోని బాలాజీ వెంకటేశ్వరస్వామి జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ చదువుతోంది. అదేగ్రామానికి చెందిన నర్సింగ్, నర్సింగరావు ఇద్దరు యువకులు ఒకరితెలియకుండా మరొకరు శరణ్యను ప్రేమించారు. నర్సింగ్ (ఆటో డ్రైవర్), కాగా నర్సింగరావు అదే కాలేజీకి చెందిన విద్యార్థి. అయితే ఇద్దరు యువకులు ప్రేమ పేరుతో శరణ్యను వేధించారు. ఇదే విషయంపై కాలేజీ వద్ద కొంత వివాదం నెలకొంది. అనంతరం ఊర్లో ఆ ఇద్దరు యువకులు గొడవ పడ్డారు. దీంతో యువతి మనస్తాపం చెందింది. వేధింపులు భరించలేక విద్యార్థిని ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని గాంధీమార్చురీకి తరలించారు. ఇద్దరు యువకులు పరారీలో ఉన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Don't Miss